దాదాపు 25 సంవత్సరాల క్రిందటి కేసులో తుది తీర్పు బుధవారం వెలువడబోతోంది. భారతదేశ రాజకీయాలను ఓ కీలకమలుపు తిప్పిన అప్పటి ఘటనలో ఈరోజు సుప్రింకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది. ఎందుకంటే అప్పటి ఘటనలో నిందితులంతా బిజెపి అగ్రనేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, సంఘ్ పరివార్ ప్రముఖులే కాబట్టి. ఇంతకీ విషయం ఏమిటంటే 1992 డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని బాబ్రీ మసీదును కూల్చేసిన విషయం తెలిసిందే. మసీదు కూల్చివేతలో బిజెపి ప్రముఖులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరితో పాటు సాద్వీ రీతంబరి, వినయ్ కటియార్, పవన్ పాండేతో పాటు మరో 20 మంది ఉన్నారు. కేసు విచారణలో ఉండగానే బాలా సాహెబ్ థాక్రే, అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్ లాంటి మరో పదిహేనుమంది మరణించారు. మసీదు కూల్చివేతకు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ఉమా భారతి లాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే కరసేవకులు పూనుకున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మసీదు కూల్చివేత తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ రాజీనామా చేశారు.
వెంటనే ఘటనపై కేంద్రప్రభుత్వం స్ధానిక పోలీసులతో విచారణ చేయించింది. దీనిపై ఆరోపణలు రావటంతో తర్వాత సిబిసీఐడీతో విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో కూడా దేశంలోని అన్నీ వైపుల నుండి కేంద్రంపై విమర్శలు మొదలవ్వటంతో చేసేది లేక చివరకు సిబిఐ విచారణకు ఆదేశించింది. మసీదు కూల్చివేతలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేకమందిపై సిబిఐ న్యాయస్ధానం కేసులను ఎత్తేసింది. అయితే ఈ విషయమై కొందరు సుప్రింకోర్టులో కేసు వేయటంతో మళ్ళీ అందరిపైనా కేసులు కంటిన్యు అయ్యాయి. తన విచారణలో సిబిఐ 49 మందిని నిందితులుగా గుర్తించగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా అనేకసార్లు కోర్టు విచారణకు హాజరయ్యారు.
దాదాపు పాతిక సంవత్సరాల విచారణ తర్వాత చివరి తీర్పు ఈరోజు వెలువడుతోంది. తీర్పు చెప్పే సమయంలో నిందితులందరు కోర్టులోనే ఉండాలని సుప్రింకోర్టు ఆదేశించింది. అయితే కొందరికి కరోనా వైరస్ సోకటం అద్వానీ, జోషి లాంటి వాళ్ళకు వయస్సయిపోవటం కారణంగా వ్యక్తిగత హాజరునుండి మినహాయింపు ఇచ్చింది. అందుకనే బిజెపితో పాటు కేంద్రప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on September 30, 2020 1:15 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…