ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి-అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. నాలుగేళ్ల కిందట జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున మోడీ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఇక, ఇప్పుడు కూడా ప్రధాని మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు.
అయితే.. మోడీ రాకపై అధికార డెమొక్రాట్ల కంటే కూడా.. ప్రతిపక్ష రిపబ్లికన్‌లకే ఎక్కువగా ఆశలు ఉన్నా యి. తమ నాయకుడు ట్రంప్‌ను గెలిపించేందుకు మోడీ వస్తున్నారంటూ.. ఆయన పర్యటనకు ముందే.. రిపబ్లికన్‌లు ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ కూడా తన మిత్రుడు(మోడీ) వస్తున్నాడని.. తనకు తిరుగు లేదని చెప్పుకొచ్చారు. మరి మోడీ మనసు మాత్రం వేరేగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మోడీ అసలు ట్రంప్ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు.
పైగా.. ప్రధాని మోడీకి.. అమెరికా ప్రస్తుత అధ్యక్షడు జోబైడెన్ కనీ వినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం ఇచ్చారు. చేతిలో చేయి వేసి మరీ మోడీని ఇంట్లోకి స్వాగతించారు. ఇల్లంతా చూపించారు. స్వయంగా టీ కాచి ఇచ్చారు. ఇద్దరూ నవ్వుతూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పరిణామాల వెనుక.. బైడెన్ చాలా వ్యూహాత్మకంగా మోడీని తన గాటన కట్టేసుకునేందుకు ప్రయత్నించారనేది అంతర్జాతీయ మీడియా కథనం. పోనీ.. మోడీ ఏమైనా దీనికి దూరంగా ఉన్నారా ? అంటే అది కూడా లేదు.
ఆయన కూడా బైడెన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న కమల హ్యారిస్ పేరు ఎత్తకపోయినా..బైడెన్‌ను ఆకాశానికి ఎత్తేయడం.. ఆయన హయాంను స్వర్గతుల్యమని పేర్కొనడం ద్వారా.. ప్రస్తుత అధికార పార్టీ డెమొక్రాట్లకే తన మద్దతు ఉందని పరోక్షంగా ప్రధాన మంత్రి చెప్పినట్టు అయింది. అంటే.. ఒకరకంగా, ఆయన కమల వైపే నిలబడ్డారన్నది అంతర్జాతీయ మీడియా చెబుతున్న మాట. సుమారు 4 లక్షల పైగా ఉన్న భారతీయ ఓటర్లపై మోడీ ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఇది ట్రంప్‌పై తీవ్ర దెబ్బవేస్తుందన్నది వారు చెబుతున్న మాట.
This post was last modified on September 23, 2024 2:37 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…