Political News

భారత్‌కు పొంచి ఉన్న మరో వైరస్ గండం

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో, చేస్తోందో చూస్తూనే ఉన్నాం. కొంచెం ముందుగా మేల్కొని భారత్‌లోకి అంతర్జాతీయ ప్రయాణాల్ని ఆపేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. ఇంతగా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేది. ఇన్ని కోట్ల మంది రోడ్డు పాలయ్యేవాళ్లు కాదు. కానీ దాని తీవ్రతను గుర్తించడంలో చాలా దేశాల్లాగే భారత్ కూడా విఫలమైంది. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ కరోనా చేసిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమైన పరిస్థితి. ఈ ప్రభావం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగబోతోందని అర్థమైంది. ఉద్దేశపూర్వకమో కాదో కానీ.. ఈ వైరస్‌తో భారత్‌ను చైనా కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఐతే ఇప్పుడు మరో చైనా వైరస్‌ భారత్‌‌కు ముప్పుగా పరిణమించే ప్రమాదమున్నట్లు సంకేతాలందుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

క్యాట్ క్యూ వైరస్ (సీక్యూవీ) అనే కొత్త ప్రమాదం భారత్‌ను తాకే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వైరస్ ఇప్పుడు చైనాలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్‌కు కూడా ముప్ప పొంచి ఉందని ఐసీఎంఆర్ అంటోంది. ఆర్ద్రోపోడ్ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకుని ఈ వైరస్ వ్యాప్తిస్తుందని.. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్‌లు ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. మన దేశంలో ప్రధానంగా పందుల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందొచ్చని హెచ్చరించింది. వీటితో పాటు కొన్ని రకాల దోమల ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని అంది. అంతర్జాతీయ ప్రయాణాలు నడుస్తున్న నేపథ్యంలో చైనా నుంచి ఈ వైరస్ వివిధ దేశాలకు పాకే ప్రమాదం ఉందని.. కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ పేర్కొంది. ఐతే ఈ వైరస్ అంటు వ్యాధా కాదా.. ఇదెంత ప్రమాదకరం అన్నది ఐసీఎంఆర్ వివరించలేదు.

This post was last modified on September 29, 2020 9:38 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

34 minutes ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

51 minutes ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

3 hours ago

ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?

​బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…

5 hours ago

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

7 hours ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

8 hours ago