Political News

పవన్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ?!

పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను గెలికి పవర్ కు దూరమయ్యామా ? అనవసరంగా అతని వ్యక్తిగత విషయాల మీద సీనియర్ లీడర్లు అయిన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్యలతో దాడి చేయించి కాపు సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నామా ?

సినీరంగ సమస్యల కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి జగన్ కలిసిన వీడియోను ఎడిట్ చేసి సోఫల్ మీడియాలో ప్రచారం చేసి పాపం మూటగట్టుకున్నామా ?

ప్రముఖ నటుడు రజనీకాంత్ వరకు సినీరంగాన్ని సినీ నటులను గెలికి 151 స్థానాలు గెలిచిన జగన్ మాత్రమే హీరో అన్నట్లు వ్యవహరించిన తీరు ఎన్నికల్లో గట్టి దెబ్బకొట్టిందా ? అన్న అంతర్మధనం వైసీపీలో మొదలయిందని తెలుస్తుంది.

గత మూడు నెలల కూటమి పాలనపై వైఎస్ జగన్, వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లను మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్లిన జగన్ పవన్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు.

‘పవన్ కళ్యాణ్ సినిమాలలో నటిస్తే .. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో నటిస్తున్నారు’ అన్న విమర్శ మాత్రమే జగన్ నోటి నుండి వచ్చింది.

2019 ఎన్నికల్లో గోదావరి జిల్లాలలో కాపుల మద్దతుతో గణనీయమైన సీట్లు సాధించిన వైసీపీ ఇటీవల ఎన్నికల్లో అసలు ఖాతానే తెరవలేదు. కాపు నేతలుగా ముద్రపడ్డ ముద్రగడ, హరిరామజోగయ్యల స్థానంలో కాపు నేతగా పవన్ కళ్యాణ్ ను భావించడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న భావన నెలకొంది.

పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలతో దాడి చేసి టార్గెట్ చేయడం మూలంగానే ఆయన కసిగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటుకు ఆజ్యం పోశాడని, పవన్ ను గెలకకుండా ఉంటే ఈ కూటమి ఏర్పాటు కాకుంటే ఎన్నికలలో ఫలితాలు మరో విధంగా ఉండేవని, ఈ స్థాయిలో పరాజయానికి అవకాశం ఉండకపోయేదని భావిస్తున్నారు. అందుకే ఇక నుండి పవన్ కళ్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది.

This post was last modified on September 17, 2024 9:44 am

Share

Recent Posts

2018 టాంపరింగ్ గొడవ… వార్నర్ ఒకవైపు, కమిన్స్ మరోవైపు!

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. 2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాజీ…

9 minutes ago

దేవాంశ్‌ సినిమాల్లోకి వెళతాడేమో అని భయంగా వుంది

తన తాత ముత్తాతల ప్రభావంతో దేవాంశ్‌ కూడా సినిమాల వైపు వెళతాడేమోనని భయంగా వుందని మంత్రి నారా లోకేష్ చెప్పిన…

56 minutes ago

ఒక మగాడి బలహీనత వల్ల లక్షల కోట్ల సామ్రాజ్యం కుదేలు

ఏఐ రంగంలో ఎన్విడియా పేరు తెలియనివాళ్లు ఉండరు. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలకు అవసరమైన చిప్స్ అందిస్తున్న ఈ…

1 hour ago

అందరూ చేయందించడం అర్జున అదృష్టం

నిన్న రాత్రి హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సులో వేసిన ఇట్లు అర్జున ప్రీమియర్ షోకు దాదాపు టాలీవుడ్ మొత్తం హాజరయ్యిందేమో అన్నంత…

1 hour ago

రామసీత రావణుల్లో ఎవరికి లాభం

రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వెయ్యి కోట్ల మార్కు అందుకుంది.…

1 hour ago

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఎన్విడియా ఇప్పుడు అనూహ్యమైన వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సంస్థ మాజీ ముఖ్య…

3 hours ago