ఈ ఏడాది నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుం ది. నిన్న మొన్నటి వరకు అధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారిస్‌కు మద్దతు పలికిన స్వరాలు.. ఇప్పుడు సవరించుకున్నాయి. తెర వెనుక ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడు ట్రంప్ బెటర్ అంటూ మెజారిటీ ఇండియన్ అమెరికన్స్ చెబుతున్నారు. అంతేకాదు.. ట్రంప్‌తోనే భారత్‌కు మేలు జరుగుతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ మార్పు ట్రంప్ శిబిరంలో జోష్ నింపింది.
అధ్యక్ష ఎన్నికల్లో తొలి నాళ్లలో బైడెన్‌కు ఇండియన్ కమ్యూనిటీస్ మద్దతు ప్రకటించాయి. తర్వాత.. కమలా హ్యారిస్‌ను ప్రకటించిన తర్వాత కూడా.. ఆమెకు అండగా ఉన్నాయి. ఈ క్రమంలో హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకానొక సందర్భంగా ట్రంప్.. ఇండియన్స్‌ను మచ్చిక చేసుకునేందుకు ఎంతో ప్రయత్నించారు కూడా. కమలను చూసి మోస పోవద్దు.. ఆమె ఇండియా వ్యతిరేకి అంటూ.. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.
అప్పట్లో అందరూ.. మౌనంగా ఉన్నా.. తాజాగా మారిన పరిణామాల నేపథ్యంలో హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ తన దారి మార్చుకుని.. ట్రంప్‌కు జై కొట్టింది. ఈ మేరకు సంస్థ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందూజా వెల్లడించారు. ట్రంప్‌తోనే భారత్-ఇండియా మధ్య రిలేషన్స్ బాగుంటాయని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల వెనుక.. బైడెన్ సర్కారు ఉందన్న వాదనను, దీనిని సమర్థించిన కమలా హ్యారిస్‌ను ఆయన తప్పుబట్టారు. అందుకే.. తాము ట్రంప్ వెంట నిలవాలని భావిస్తున్నామన్నారు.
ఎంత మేరకు ప్రభావం?
హందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ ఏమేరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనేది కూడా ఆసక్తికర విషయం. ఇండియన్స్ ఎక్కువగా ఉండే.. ప్రాంతాల్లో ఈ సంస్థకు మెంబర్ షిప్ ఉంది. నార్త్ కరోలినా, జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నెవాడ, ఆరిజోనాలలో మెజారిటీ ఇండియన్స్.. ఓటర్లను ఈ సంస్థ ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే.. గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉంటుందా? అనేది చూడాలి.
This post was last modified on September 8, 2024 5:01 pm
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…