సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరే ట్‌లోనే సీఎం చంద్రబాబు గత ఆరు రోజులుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం వినాయక చవితిని పురస్కరించుకుని చంద్రబాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే చంద్రబాబు ఈ పూజలో పాల్గొని గణనాథునుని అర్చిస్తున్న సమయంలోనే ఆయనకు గుడ్ న్యూస్ అందింది. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బుడమేరుకు పడిన మూడో గండి ఎప్పటికి పూడుతుందో అన్న బెంగతో ఉన్న సర్కారుకు ఆర్మీ అధికారులు సక్సెస్ వార్త మోసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు పూజలో ఉన్న సమయంలోనే వినడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆర్మీకి, మంత్రులకు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలి పారు. అనంతరం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టరేట్‌కు వచ్చారు. తాను ప్రకటించిన వరద సాయం రూ.కోటికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు.
అనంతరం.. ఇరువురు కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు. విజయవాడలో చేపట్టిన సాయం, బాధితు లకు అందుతున్న సేవలను ఇరువురూ సమీక్షించారు. బాధితులకు మరింత మెరుగైన సేవలు అందిం చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి తమ వంతు సాయం అందిస్తా మని.. జనసేనికులు శనివారం నుంచి ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి.. బాధితులను ఆదుకుంటారని పవన్ కల్యాణ్ చెప్పారు. కాగా.. వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ ఆరోగ్య విషయాన్ని చంద్రబాబు ఆరా తీశారు.
మరోవైపు.. బీజేపీ నాయకుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా సీఎంచంద్రబాబును అదేసమయం లో కలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరంగా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. బాధితులకు 24 గంటలు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు.మందులను కూడా విరివిగా పంపిణీ చేస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి.. మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
This post was last modified on September 8, 2024 4:58 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…