Political News

జ‌గ‌న్‌ పై నెటిజ‌న్ల ఫైర్‌.. బ్ర‌హ్మాజీ వ్యంగ్యం!

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా శ‌నివారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ వ‌ర‌దల విష‌యంపై సుదీర్ఘ పోస్టు చేశారు. మొత్తం 8 అంశాల‌తో ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర‌ద‌లు వ‌చ్చి 8 రోజులు అయిపోయినా బాధితుల ఆక‌లి కేక‌లు వినిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఏమైపోయింద‌ని నిలదీశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా? లేదా? అని కూడా ప్ర‌శ్నించారు. మొత్తానికి ఈ పోస్టు చాలా వేగంగా వైర‌ల్ అయింది.

దీనిపై మెజారిటీ నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రికొంద‌రు.. జ‌గ‌న్ బెస్ట్‌! అని కీర్తించారు. విమ‌ర్శ‌ల విష‌యానికి వ‌స్తే.. ఆక‌లి కేకలు వినిపిస్తే.. మీరు ఏం చేస్తున్నారని ఎక్కువ మంది ఎదురు ప్ర‌శ్న వేశారు. మ‌రికొంద‌రు ఇప్ప‌టికే చంద్ర‌బాబు బుర‌ద‌, వ‌ర‌ద‌లో దిగి తిరుగుతున్నారు. బాధితుల‌ను ఆదుకుంటు న్నారు.. ఇవేవీ మీకు క‌నిపించ‌డం లేదా? అని నిగ్గ‌దీశారు. పేద‌ల ప‌క్ష‌పాతి.. పెత్తందారుల సాయం కోసం ఎదురు చూడ‌కుండా.. మీరే దిగిపోవ‌చ్చు క‌దారంగంలోకి అంటూ మ‌రో నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.

ఇది రాజ‌కీయ ఆట కాదు.. ప్ర‌జా జీవితం అంటూ మ‌రికొంద‌రు స్పందించారు. ఈ విమ‌ర్శ‌ల సుడిగుం డంలో ప‌డి జ‌గ‌న్ పోస్టు భారీగా ఎదురీత ఎదుర్కొంది. ఇక‌, సినీ క్యారెక్ట‌ర్ న‌టుడు బ్రాహ్మాజీ మ‌రో విధంగా జ‌గ‌న్‌కు చుర‌క‌లు అంటించారు. అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌ల్లో వ్యంగ్యం ఎక్కువ‌గా క‌నిపించ‌డం గ‌మ‌నా ర్హం. “మీరు చెప్పింది(చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉందా లేదా? యంత్రాంగం ఏమైపోయింది) క‌రెక్ట్ స‌ర్‌! అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. వాళ్లు(ప్ర‌భుత్వం) చేయ‌లేరు. ఇక నుంచి మ‌నం చేద్దాం. వెంట‌నే మ‌నం వెయ్యి కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేద్దాం. మ‌న వైసీపీ కేడ‌ర్ మొత్తాన్నీ రంగంలోకి దించుదాం. మ‌న‌కు జ‌నాలు ముఖ్యం. ప్ర‌భుత్వం కాదు. మ‌నం చేసి చూపిద్దాం సార్‌. జై జ‌గ‌న‌న్న‌! అని బ్ర‌హ్మాజీ కామెంట్ చేశారు. అయితే.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించిన వారు కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న వారి వీడియోలు..సాయం అంద‌రికీ అందించలేక పోతున్నాం.. అధికారులు స‌రిగి ప‌నిచేయ‌డం లేదు అని సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల వీడియోల‌ను మ‌రికొంద‌రు జ‌గ‌న్ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.

బ్ర‌హ్మాజీ ఎక్స్‌ హ్యాక్

జ‌గ‌న్ పోస్టుకు కామెంట్ చేసిన బ్ర‌హ్మాజీ ఎక్స్‌ హ్యాండిల్ హ్యాకైంది. దీంతో ఆయ‌న త‌న పోస్టును డిలీట్ చేశారు.

This post was last modified on September 8, 2024 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

14 minutes ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

36 minutes ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

1 hour ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

2 hours ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

7 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

9 hours ago