ఏపీలో సంభవించిన వరదల కారణంగా.. నష్టం 6,800 కోట్ల రూపాయలుగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే.. ఇది ప్రాథమిక అంచనానేనని వెల్లడించారు. గత ఆదివారం ముంపు ముంచెత్తిన కాలనీలు, నగరాల్లో పరిస్థితిని క్షేత్రస్థాయిలో మరోసారి అంచనా వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి వేసినఅంచనా ప్రకారం బాధిత ప్రాంతాల్లో జరిగిన నష్టం 6800 కోట్లుగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి 322 పేజీలతో కూడిన నివేదికను కేంద్రానికి పంపుతున్నామన్నారు.
సింగ్‌నగర్‌ను పూర్తిగా వరద ముంచెత్తిందన్నారు. ఇక, దీనికి దిగువన ఉన్న ప్రకాశ్ నగర్, పాయకాపురం, ప్రశాంతి నగర్, శాంతి నగర్‌లను కూడా వరద ముంచేసిందని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్లు కూడా వరద నీటిలో చిక్కుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, అయితే.. కేంద్రం నుంచి తక్షణ సాయం అందాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సూచ నల మేరకు ప్రాధమిక నివేదికను అందిస్తున్నామన్నారు.
నివేదికలో పేర్కొన్న విషయాలు ఇవీ..
+ 32 మంది మృతి చెందగా, 2 లక్షల మంది ఇళ్లు కోల్పోయారు.
+ సుమారు 2 లక్షల ఎకరాల్లో సాధారణ పంటలు,18 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు నీటమునిగాయి.
+ 2.34 లక్షల మంది రైతులు నష్టపోయారు.
+ ఆర్ అండ్‌బీకి రూ.2,164.5 కోట్ల నష్టం జరిగింది.
+ జలవనరుల శాఖకు రూ.1,568.6 కోట్ల నష్టం వాటిల్లింది.
+ మున్సిపల్ శాఖకు రూ.1,160 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.481 కోట్ల నష్టం జరిగింది.
+ వ్యవసాయ శాఖకు రూ.301 కోట్ల వరకు నష్టం జరిగింది.
+ పంచాయతీరోడ్లకు రూ.167.5 కోట్ల మేరకు భారీ నష్టం వాటిల్లింది.
+ మత్స్యశాఖకు రూ.157.86 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు 75.5 కోట్ల మేరకు నష్టం జరిగింది.
+ ఉద్యానవన శాఖకు రూ.39.9 కోట్లు
+ పశుసంవర్ధక శాఖకు రూ.11.5 కోట్లు
This post was last modified on September 8, 2024 9:58 am
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ…
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్‌లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…