Political News

ప్రజలకు వజ్రాయుధం ఇచ్చిన చంద్రబాబు

భారీ వర్షాలు.. వరదలు విజయవాడ ను ముంచేసి వారం దాటేసింది. ఎనిమిది రోజులు పూర్తై.. తొమ్మిదో రోజుకు చేరుకున్న పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొన్నది లేదు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నా.. పరిస్థితి సాధారణ స్థాయికి రాని పరిస్థితి. అయితే.. జరిగిన నష్టం భారీగా ఉండటం… సైన్యం రంగంలోకి దిగినా ఇంకా పరిస్థితి చక్కబడలేదు. కానీ ప్రభుత్వ అలసత్వం లేదనే చెప్పాలి.

విజయవాడను వరద ముంచెత్తిన మొదటి రోజు నుంచి అక్కడే ఉండి.. ఇంటికి వెళ్లకుండా.. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. సమస్యల్ని పరిష్కరించేందుకు.. బాధితులకు సాయం అందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పడిన కష్టం అంతా ఇంతా కాదు.

అయినప్పటికీ ఆశించినంత ఫలితం రావట్లేదన్న పెదవి విరుపు వినిపిస్తూ ఉంది. ఇలాంటి వేళ.. తాజాగా చంద్రబాబు నోటి నుంచి సీరియస్ మాట ఒకటి వచ్చింది. ఖర్చు గురించి వెనకాడకుండా పని చేస్తున్న ప్రభుత్వానికి రావాల్సిన పేరు రాకపోవటంతో బాధితుల హాహాకారాలను చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.

తప్పు చేసే అధికారుల చొక్కా పట్టుకొని మరీ నిలదీయాలని.. ఏదైనా జరిగితే తాను చూసుకుంటానంటూ భారీ భరోసాను ఇచ్చేయటం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాల కిట్లు ఎవరికి అందకపోయినా.. డిమాండ్ చేసి మరీ తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75 శాతం మంది కోరుకుంటున్నారని.. కష్టమైనా ఇంటింటికి వెళ్లి నిత్యవసరాలు పంపిణీ చేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఇళ్ల లో వస్తువల రిపేర్లకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారి కోసం అర్బన్ కంపెనీతో రివ్యూ చేశామన్న చంద్రబాబు.. విజయవాడలో అర్బన్ కంపెనీకి తక్కువ నిపుణులు ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కొందరికి శిక్షణ ఇచ్చి వారికి అనుసంధానం చేస్తామని చెబుతున్నారు. వరద ప్రాంతాల్లో తాను పర్యటించిన వేళలో.. చాలామంది ఉపాధి కల్పించాలని కోరుతున్నారని.. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా.. వర్చువల్ గా ఉపాధి కల్పిస్తామన్న హామీని ఇచ్చారు చంద్రబాబు. వారం రోజుల్ని లక్ష్యంగా పెట్టుకొని బీమా ఇష్యూలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరోవైపు భారీ వర్షాలు.. వరదల కారణంగా ఏపీకి జరిగిన నష్టం రూ.6882 కోట్లుగా సర్కారు లెక్క కట్టింది. దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేసింది. కేంద్రానికి ఈ నివేదికను పంపున్నారు. ఆర్ అండ్ బీకి 2164 కోట్లు.. నీటివనరుల శాఖకు రూ.1568 కోట్లు.. పురపాలక శాఖకు రూ.11600 కోట్లు.. రెవెన్యూ శాఖకు రూ.750 కోట్లు.. విద్యుత్ శాఖకురూ.481 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా లెక్కలు తేలాయి. మరికొన్ని శాఖలకు జరిగిన నష్టాన్ని సైతం లెక్కించారు. వీటి రిపోర్టులను కూడా కేంద్రానికి పంపనున్నారు. మరి.. కేంద్రం నుంచి వచ్చే పరిహారం ఎంతన్నది తేలాల్సి ఉంది.

This post was last modified on September 8, 2024 9:32 am

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

37 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago