పరువు హత్యల కథలు చాలా విన్నాం, ఐతే అగ్ర కులానికి చెందిన ఓ అమ్మాయి.. వేరే కులం అబ్బాయితో వెళ్లిపోయినపుడు ఆమె తండ్రి పగతో రగిలిపోయి దారుణాలకు ఒడిగట్టిన ఉదంతాల్ని పరిశీలిస్తే.. అమ్మాయి తల్లి చాలా వరకు ఇలాంటి దారుణాన్ని వ్యతిరేకించినట్లే వెల్లడవుతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో తండ్రి కూతురిని కాదనుకున్నప్పటికీ.. తనతో తల్లి చాటుగా మాట్లాడే ప్రయత్నం చేయడం, కూతురు అల్లుడు బాగుండాలని కోరుకోవడం సహజం. సినిమాల్లో చూసినా, బయట ఉదంతాల్ని పరిశీలించినా మామూలుగా అయితే ఇదే జరుగుతుంది. కానీ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి అమ్మాయి కుటుంబ సభ్యుల చేతిలో దారుణ హత్యకు గురైన హేమంత్ ఉదంతంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. అతడి భార్య అవంతి కుటుంబ సభ్యులందరూ కలిసి అతణ్ని చంపడానికి ఏకమయ్యారు. అందులో అవంతి తల్లిది ప్రధాన పాత్రగా వెల్లడవుతుండటం గమనార్హం.
హేమంత్‌తో అవంతి ప్రేమ, పెళ్లిని జీర్ణించుకోలేకపోయిన ఆమె తల్లి అర్చన.. హేమంత్‌ను చంపేవరకు తాను అన్నం ముట్టనని ఒట్టు పెట్టుకుందట. ఆమెను మరింతగా రెచ్చగొట్టిన సోదరుడుయుగేందర్ రెడ్డి హేమంత్ హత్యకు కుట్ర పన్నాడట. ఈ విషయాన్ని అవంతి స్వయంగా వెల్లడించింది. హేమంత్ తల్లి, తన తల్లి స్నేహితులే అని.. బ్యుటీషియన్ అయిన హేమంత్ తల్లి తమ ఇంటికి వచ్చి వెళ్తుండేదని.. తర్వాత తాను హేమంత్, ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నామని.. కానీ తమ పెళ్లి తన తల్లికి అస్సలు ఇష్టం లేదని.. దీంతో హేమంత్‌ను చంపాల్సిందే అని ఆమె పట్టుబట్టి కూర్చుందని.. అతణ్ని చంపేవరకు తాను అన్నం తినని శపథం చేసినట్లు తనకు తెలిసిందని అవంతి మీడియాకు వెల్లడించింది. ఈ వ్యవహారం తన పాత్రేమీ లేదన్నట్లుగా తన సోదరుడు అశిష్ రెడ్డి దూరంగా ఉంటున్నాడని.. కానీ కుట్రలో అతను కూడా భాగమే అని తన తల్లిదండ్రుల్ని బయటికి తీసుకురావడానికి అతను ప్రయత్నిస్తున్నాడని.. తనను కూడా అరెస్ట్ చేయాలని అవంతి డిమాండ్ చేసింది. హేమంత్ తల్లిదండ్రులే ఇకపై తన తల్లిదండ్రులని, వారితోనే ఉంటానని.. తన భర్త హత్యలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడే వరకు పోరాటం సాగిస్తానని ఆమె స్పష్టం చేసింది.
This post was last modified on September 28, 2020 8:22 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…