Political News

రేవంత్ రెడ్డికి ‘కులం’ తలనొప్పి

అధికారంలో ఉన్న వాళ్లు కుల సంఘాల సమావేశాలకు వెళ్తే లేని పోని తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆయన గత నెలలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్‌కు వెళ్లారు. అందులో ఆ కులానికి చెందిన వారు చెప్పుకున్న గొప్పల గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. వాళ్లను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా విమర్శలు తప్పలేదు.

పర్టికులర్‌గా ఒక కులానికి ఎలివేషన్ ఇవ్వడం వల్ల వేరే కులాల వాళ్లు నొచ్చుకుంటారనడంలో సందేహం లేదు. అంతే కాక రేప్పొద్దున వేరే కులాల వాళ్లు కూడా తమ సమావేశాలకు పిలిస్తే.. ప్రతిసారీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లలేడు కదా.. వెళ్లి ఒక్కో కులాన్ని పొగుడుతూ ఉంటే బాగుండదు కదా.. ఒక మీటింగ్‌కు వెళ్లి ఇంకో మీటింగ్‌కు గైర్హాజరైతే వాళ్లు నొచ్చుకుని గొడవ చేస్తారు కదా అనే చర్చ నడిచింది. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది.

తాజాగా రేవంత్ రెడ్డి క్షత్రియ కుల సంఘం నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి వెళ్లారు. యథావిధిగా ఆ కులాన్ని పొగిడారు. మరో వైపేమో గౌడ సామాజిక సంఘానికి చెందిన సర్వాయిపాపన్న జయంతి కార్యక్రమానికి ఆహ్వానిస్తే.. దానికి మాత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను పంపించారు. దీంతో గౌడలు అంటే ముఖ్యమంత్రికి చిన్న చూపని.. ఆంధ్రా వాళ్లు నిర్వహించే కుల సంఘాలకు వెళ్తూ తెలంగాణలో అధికంగా ఉన్న, వెనుకబడ్డ సామాజిక వర్గమైన గౌడ సంగం నిర్వహించే కార్యక్రమాన్ని ఆయన విస్మరించారని.. ఇది అగ్ర కుల దురహంకారమని ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలు ఇంతటితే ఆగడం కూడా కష్టమే.

ఇప్పటికే రెండు కులాల మీటింగ్‌కు హాజరైన నేపథ్యంలో రేప్పొద్దున వేరే కులాల వాళ్లు కూడా రేవంత్‌ను ఆహ్వానించకుండా ఉండరు. ఎవరికి నో చెప్పినా వాళ్ల నుంచి విమర్శలు తప్పవు. అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలాంటి మీటింగ్స్‌కు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on August 20, 2024 10:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago