చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశమే కాదని రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకుందని పలువురు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి కలుసుకున్నారు.
శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావడం, వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం అనే కీలక అంశాలపై చంద్రబాబు చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రవారం రాత్రి జరిగిన భేటీలో పోలవరానికి సంబంధించిన నిధులను త్వరగా కేటాయించాలని చంద్రబాబు కోరినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే అసలు రాజకీయంగా ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం.
రాష్ట్రంలోనూ ఆందోళనలకు పిలుపునివ్వడం. అదేవిధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులతో ఆయన కలిసిమెలిసి ఉండటం వంటి అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావించి జగన్ పై కేసులను త్వరితగతిని తేల్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఒక చర్చ అయితే ఇప్పుడు జాతీయ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియకపోయినా, ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం వెనుక కేంద్రంలో అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆందోళనలు నిరసనలు కారణమై ఉంటాయని సందేహాలు వ్యక్తమవుతున్నా యి.
ఇప్పుడు గనక జగన్‌ను నిలువరించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు రాజకీయంగా వేస్తున్న అడుగులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నాయకులకు జగన్ అత్యంత దగ్గరగా ఉన్నారని ఆయనను నిలువరించాలని కోరనున్నట్టు జాతీయ మీడియా చెబుతోంది.
మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియాలి. ఏదేమైనా ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
జగన్‌ను సాధ్యమైనంత వరకు నిలువరించడంతోపాటు.. వైసీపీ రాజ్యసభ సభ్యుల వ్యవహారంపై అమిత్‌షాతో చర్చించే అవకాశం ఉందని జాతీయ మీడియా చెబుతోంది. అదేవిధంగా రాష్ట్రం మరికొంత అప్పు చేసుకునేందుకు అవకాశం కల్పించేలా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కూడా ముఖ్యమంత్రి కోరనున్నట్లు తెలిసింది. ఎలా చూసుకున్నా.. ఇది రాజకీయంగానే ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.
This post was last modified on August 18, 2024 11:23 am
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన…
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…