Political News

పొలిటిక‌ల్ పోరులో జ‌న‌సేన వెనుక‌బ‌డిందా?

పొలిటిక‌ల్ మీట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ జ‌న‌సేన వెనుక‌బ‌డిందా? గ‌డిచిన వారం రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకునేందుకు ఇత‌ర ప‌క్షాలు ప్ర‌య‌త్నించిన రీతిలో ప‌వ‌న్ ప్ర‌య‌త్నించ‌లేదా? పైగా మిత్ర ప‌క్షం బీజేపీతోనూ ఆయ‌న క‌లివిడిగా ఉండ‌లేక పోతున్నారా? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లను టీడీపీ, బీజేపీలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని.. ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డంతోపాటు.. రాజ‌కీయంగా కూడా కొంత మైలేజీ పొందేందుకు ప్ర‌య‌త్నించాయి.

ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యాయా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. బీజేపీ నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. టీడీపీ నాయ‌కులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మైనా.. హాట్ కామెంట్ల‌తో వేడెక్కించారు. ఈ ప‌రిణామాల‌తో ఆ రెండు పార్టీల్లోనూ కొంత మేర‌కు గ్రాఫ్ పెరిగింద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కానీ.. ఇదే స‌మ‌యంలో యాక్టివ్‌గా ఉండాల్సిన జ‌న‌సేనాని ప‌వ‌న్ మాత్రం హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మైనా.. రాష్ట్రంలో కీల‌క నేత‌ల‌ను క‌దిలించ‌డంలోను, ఏదో ఒక రూపంలో ఉద్య‌మించేందుకు, లేదా స‌ద‌రు దాడుల‌పై ఆశించిన విధంగా స్పందించ‌డంలోను ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే అభిప్రాయం జ‌న‌సేన‌లోనే వ్య‌క్త‌మ‌వుతోంది.

పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం పంచుకుంటామ‌ని.. చెబుతున్న మిత్ర‌ప‌క్షం బీజేపీ.. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించిన స‌మ‌యంలో ఎక్క‌డా జ‌న‌సేన నేత‌లు కానీ, ఆ పార్టీ జెండాలు కానీ క‌నిపించ‌లేదు. ఇటీవ‌ల కాలంలో ప‌లు వేదిక‌ల‌పై సోము వీర్రాజు మాట్లాడుతూ… జ‌న‌సేన త‌మ‌కు న‌మ్మ‌ద‌గిన మిత్ర‌ప‌క్ష‌మ‌ని చెబుతున్నారు. అలాంట‌ప్పుడు.. తాజాగా ఎత్తుకున్న అజెండా విష‌యంలో ప‌వ‌న్‌ను ఆయ‌నే క‌లుపుకొని పోలేదా? లేక‌.. మ‌న‌కెందుకులే .. అని ప‌వ‌నే దూరంగా ఉన్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నార‌ని స‌మాచారం.

పోనీ.. బీజేపీతో క‌లిసి ఉద్య‌మించ‌క‌పోయినా.. పార్టీ ప‌రంగా అయినా.. ఏదో ఒక‌రూపంలో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌తో ముందుకు సాగ‌డంలో ప‌వ‌న్ విఫ‌ల‌మ‌య్యారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లేక‌.. కేవ‌లం హిందూ దేవాల‌యాల‌పై దాడులు జ‌రిగితే.. తానే స్వ‌యంగా రంగంలోకి దిగితే.. ఇత‌ర మ‌త‌స్థుల్లో ఉన్న సానుభూతి త‌న‌కు దూర‌మ‌వుతుంద‌ని ఆయ‌న భావించారా? అనే ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏదేమైనా.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో టీడీపీ, బీజేపీలు వ్య‌వ‌హ‌రించిన తీరులో ప‌వ‌న్ దూకుడు చూపించ‌లేక‌పోయార‌నేది వాస్త‌వ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 26, 2020 9:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Janasena

Recent Posts

నాగచైతన్య.. గ్రాఫిక్స్ కోసమే 30 కోట్లా?

యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…

15 mins ago

ఇంచార్జ్‌ల‌ను మార్చినా వైసీపీకి ఊపులేదు

ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా…

39 mins ago

దేవర 2 మీద అక్కర్లేని అనుమానాలు

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…

1 hour ago

మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేసిన‌ చంద్ర‌బాబు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్ర‌వేశ…

2 hours ago

వావ్….నాగార్జున చేతికి డాల్బీ విజన్

ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…

2 hours ago

ఒట్టు..ప్రభాస్ ఎవరో తెలీదు: షర్మిల

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…

3 hours ago