ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కారు ఏర్పడింది. ఈ నెల 12కు ప్రభుత్వం పగ్గాలు చేపట్టి కూడా రెండు మాసాలు అవుతుంది. ఇప్పటి వరకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపిస్తున్నా.. కనిపిస్తున్నా.. పక్కాగా అయితే.. ఇప్పటికీ నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం పింఛన్ల పెంపుదలకు మాత్రమే సర్కారు పరిమితమైంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో సంక్షేమాన్ని కొనసాగించాలంటే.. కొన్ని సంస్కరణలు అమలు చేయాల్సి ఉందని సర్కారు భావిస్తోంది.
అయితే.. ఆ సంస్కరణలు అమలు చేస్తే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఇబ్బంది ఒకవైపు వెంటాడుతోంది. అలాగని వాటిని కొనసాగిస్తే.. సంక్షేమ పథకాలను కొనసాగించడం.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం వంటివి అత్యంత కష్టంగా మారుతాయని కూటమి పార్టీల మధ్య చర్చ సాగుతోంది. దీంతో సంస్కరణల దిశగా అడుగులు వేయాలని ఒకవైపు భావిస్తూనే.. మరో వైపు కొన్నాళ్లు వేచి చూడాలని నిర్ణయించారు. అప్పటి వరకు కూడా పాలన పరంగా కీలకమైన ముందడుగులు పడే అవకాశం తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఏంటా సంస్కరణలు..
గత వైసీపీ ప్రభుత్వం.. వచ్చే 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో అర్హత ఉన్నా.. లేకున్నా.. కొందరికి వైట్ రేషన్ కార్డులు పంపిణీ చేసింది. తద్వారా.. ప్రజలంతా తమవెనుకే ఉంటారని జగన్ భావించారు. ఇది.. ఇతర పథకాలకు కూడా ముడి పెట్టారు. ఫలితంగా అప్పట్లోనే రాష్ట్రం అప్పులు చేయాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు నాటి జగన్ పథకాలకంటే కూడా.. ఎక్కువగా ఇవ్వాల్సి వస్తోంది. ఇలా చేయాలంటే.. అనర్హులను ఏరి వేయాలి. అంటే.. రేషన్ కార్డులను ఏరేయాలి. ఇది చేస్తే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేది ఆలోచన.
ఇక, పింఛన్ల విషయంలోనూ.. అర్హులు.. అనర్హులు ఇద్దరూ ఉన్నారనేది ప్రస్తుతం కూటమి సర్కారు భావిస్తున్న విషయం. అపార్ట్‌మెంట్లు, విల్లాలు ఉన్నవారి ఇళ్లలోనూ వృద్ధులు, వితంతువులు పింఛన్లు తీసుకుంటున్నట్టు లెక్కలు తేలాయి. మరి అప్పట్లో ఎలా ఇచ్చారో.. తెలియదు కానీ.. ఇప్పుడు ఇలాంటి వారికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అదేసమయంలో భార్యా భర్తలు కొన్ని కొన్ని చోట్ల ఉద్దేశ పూర్వకంగా వేర్వేరుగా ఉంటూ.. ఒంటరి పింఛన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారని తేలింది.
మరో కీలక విషయం.. ఇంటింటికీ రేషన్ వాహనాలు. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వీటి వల్ల.. సర్కారుపై ఏటా 1800 కోట్ల భారం పడుతోంది. మరోవైపు.. రేషన్ దుకాణాల డీలర్లు.. తమ ఉపాధిని పోగొట్టారని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ దుకాణాలను ప్రోత్సహించాలన్నది కూటమి సర్కారు భావన. ఈ క్రమంలో వైసీపీ సర్కారు కొనుగోలు చేసి ఇచ్చిన.. వాహనాల పరిస్థితి ఏంటి? వీటిని తీసేస్తే.. ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది సర్కారు యోచన. మొత్తానికి సంస్కరణలు అమలు చేయాలని ఉన్నా.. చిక్కులు వస్తాయనేది సర్కారు ఆలోచన.
This post was last modified on August 5, 2024 10:19 am
ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి…
2012 లో ఉప్పెన మూవీ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి..శ్యామ్ సింగరాయ్,. బంగార్రాజు చిత్రాలతో వరుస హిట్స్…
భారత పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా..…
ఒకవైపు దేశాన్ని మరోవైపు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తున్న అంశం… ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ కుబేరుడు.. గౌతం అదానీ…
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోన్న ఐపీఎల్-2025 ఆక్షన్ సందర్భంగా కొందరు క్రికెటర్లు కాసుల పండగ చేసుకుంటున్నారు. అదే సమయంలో మరికొందరు…
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…