ఏపీలో ఏర్పడిన కూటమి సర్కారు నాయకుడు, ప్రభుత్వాధినేత చంద్రబాబు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలను గమనిస్తే.. చాలా వ్యూహాత్మకంగా ఆయన అడుగులు వేస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఎక్కడా తొందరపాటు లేకుండా.. ఆచి తూచి అడుగులు వేయడంలో చంద్రబాబు స్థితప్రజ్ఞతను అందరూ ఫాలో అవ్వాల్సిందే.. అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎక్కద తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా కూడా.. ఆయన పేరు తెచ్చుకున్నారు. విషయంలోకి వెళ్తే.. పార్టీ అయినా ఎన్నికలకు ముందు.. ఇచ్చే హామీలను అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతుంది.
ఈక్రమంలో ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తుంది. ఇలానే గతంలో వచ్చీ రావడంతోనే వైసీపీ సర్కారు.. కూడా పథకాలు అమలు చేసింది. అయితే.. ఈక్రమంలోనే లెక్కకు మించిన అప్పులు చేశారనేది రాజకీయంగా వినిపించిన విమర్శ. ఇక, ఇన్ని పథకాలు అమలు చేసినా.. అప్పులు చేయడాన్ని ప్రజలు సహించలేదు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందికి గురి చేయడాన్ని కూడా.. అనుమతించలేదు. దీంతో ఎన్నికల్లో వైసీపీకి బలమైన వ్యతిరేకత వచ్చింది. ఇక, ఇప్పుడు కూటమి సర్కారును గమనిస్తే..చంద్రబాబు కూడా ఎన్నికలకు ముందు చాలా పథకాలనే హామీలుగా గుప్పించారు.
సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్నీ కావు. ఇవి వేల కోట్లరూపాయలతో ముడిపడి ఉన్నాయి. ఇవే ఎన్నికల్లో కూటమిని బలంగా గట్టెక్కించాయనే వాదన కూడా ఉంది. అయితే.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా వీటిని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికిప్పుడు హడావుడి పడిపోయి.. వీటిని అమలు చేస్తే.. మరిన్ని అప్పులు చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసుకున్న చంద్రబాబు.. కొంత ‘టైం’ తీసుకునేందుకే మొగ్గు చూపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజలకు విన్నవించారు కూడా.. ‘అర్థం చేసుకోమని కోరుతున్నా’ అని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎంత లాభం?
ఇలా.. సూపర్ సిక్స్ పథకాలను వాయిదా వేయడం వల్ల.. కూటమి సర్కారుకు వచ్చే లాభం ఎంత? అనేది ఆసక్తికరం. పథకాలు ఆపిన కారణంగా.. ఏడాదికి రూ.45 వేల కోట్లరూపాయలు ఆదా అవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు తల్లికి వందనం పథకంలోనే 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదా కానుంది. రైతులకు పెట్టుబడి సాయం కింద 15 వేల కోట్ల రూపాయలు, నిరుద్యోగ భృతి కింద 12 వేల కోట్ల రూపాయలు,(నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి 36 వేలు అనుకుంటే). ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఎన్ని నెలలు వాయిదా వేస్తే.. అన్ని రూ.250 కోట్లు చొప్పున ప్రబుత్వానికి మేలు జరుగుతుంది. అందుకే కాస్త లేటయినా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పుంజుకునే వరకు వెయిట్ చేసి వాటిని అమలు చేయాలని చంద్రబాబు చాణక్యం ప్రదర్శిస్తున్నారు.
This post was last modified on July 28, 2024 8:52 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…