“జగన్ తన తీరును మార్చుకోకపోతే.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మిగలరు” అంటూ.. ఆర్థిక శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. జగన్ శుక్రవారం ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. అనేక కామెంట్లు చేశారు. అయితే.. వీటిలో కీలకమైన వ్యాఖ్య.. వైసీపీకి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరూ మిగలరు! అనే. మరి పయ్యావుల వ్యూహం ఏంటి? ఈయనేమీ చిన్నా చితకా నాయకుడు కాదు. సీనియర్ నేత, పైగా సుదీర్ఘ అనుభవం.. చంద్రబాబుతో చనువు ఉన్న నాయకుడు.
మరి పయ్యావులే చెబుతున్నారంటే.. తెరవెనుక ఏం జరుగుతోందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. సాధారణంగా తమకు ముప్పు పొంచి ఉందని తెలిసినా.. తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని భావించినా.. మాజీలు, తాజాలు.. కూడా జంప్ చేస్తున్న పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ .. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే(జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి) జగన్‌కు వీర విధేయులు. మిగిలిన వారికి ఆయనపై అభిమానం ఉన్నా.. కేసులకు మాత్రం సిద్ధంగా ఉండరు కదా!
ఇక, ఇదేసమయంలో జగన్‌ను కనుక.. అరెస్టు చేసే ఉద్దేశం ఉండి ఉంటే.. అప్పుడు పార్టీ మరింత కకావికలం అవుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో ముందే తట్టబుట్ట సర్దుకుని సేఫ్ జోన్‌కు చేరుకున్నా.. ఆశ్చర్యం లేదు. ఆ సేఫ్ జోన్ ఏదైనా కావొచ్చు. టీడీపీనా, జనసేననా, బీజేపీనా అన్నది ముఖ్యంకాదు.. కేసులు ఎదుర్కొంటున్నవారు.. బీజేపీవైపు వెళ్లి ఆత్మరక్షణ పొందే ప్రయత్నం చేయొచ్చు. మిగిలిన వారు అవకాశాలను బట్టి తమ తమ ఇష్టానుసారం.. అవతల నుంచి వచ్చే అవకాశం మేరకు.. జంప్ చేయొచ్చు. ఎలా చూసుకున్నా.. పయ్యావుల కేశవ్ ప్రకటన అయితే.. సీరియస్‌గానే ఉంది. మరి వచ్చే రెండు మూడు వారాల్లోనే వైసీపీలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి.
This post was last modified on July 27, 2024 9:54 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…