Political News

అసెంబ్లీకి మ‌ళ్లీ డుమ్మా.. వాయిస్ కోల్పోతున్న జ‌గ‌న్‌!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ గురువారం కూడా అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. సోమ‌వారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు వ‌చ్చి.. హ‌డావుడి చేసిన జ‌గ‌న్‌.. త‌ర్వాత‌.. రోజు రాలేదు. ఆ వెంట‌నే ఢిల్లీలో ధ‌ర్నా ఉందంటూ.. అక్క‌డ‌కు వెళ్లిపోయారు. త‌న‌తో పాటు త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను కూడా తీసుకువెళ్లిపోయారు. దీంతో మంగ‌ళ‌వారం, బుధ‌వారం స‌భ‌కు డుమ్మా కొట్టారు.

ఇక‌, ఢిల్లీలో కార్య‌క్ర‌మాన్ని ముగించుకుని.. గురువారం ఉద‌య‌మే తాడేప‌ల్లికి చేరుకున్నారు జ‌గ‌న్‌. అయిన‌ప్ప‌టికీ.. గురువారం ఆయ‌న స‌భ‌కు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం స‌భ‌లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేస్తార‌న్న విష‌యం తెలిసి కూడా.. త‌న వారిని కూడా పంపించ‌కుండా.. కాల‌క్షేపం చేశారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయిన‌.. జ‌గ‌న్‌.. ధ‌ర్నా జ‌రిగిన విధానంపై చ‌ర్చించారు. మున్ముందు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌పై వారితో సూచ‌న‌లు, స‌ల‌హాలు పంచుకున్నారు.

అయితే.. జ‌గ‌న్ క‌నుక స‌భ‌కు వ‌చ్చి ఉంటే.. ఆయ‌న వాయిస్ వినిపించేందుకు అవ‌కాశం ఉండేది. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం కూడా శ్వేత‌ప‌త్రాల‌తో హుడావుడి చేస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌భ‌కుడుమ్మా కొట్ట‌డం.. త‌న వారిని కూడా.. డుమ్మా కొట్టించ‌డంతో స‌భ‌లో చెబుతున్న‌వ‌న్నీ కూడా.. వాస్త‌వాలేన‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సించే అవ‌కాశం మెండుగా ఉంటుంది. మ‌రి.. ఇదే జ‌రిగి.. ప్ర‌జ‌లు వాటిని విశ్వ‌సిస్తే.. జ‌గ‌న్‌కు సొంత ఇమేజ్ మ‌రింత దెబ్బ‌తినే అవ‌కాశం పెరుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇదిలావుంటే.. శాస‌న మండ‌లిలో బ‌లం ఎక్కువ‌గా ఉన్నప్ప‌టికీ.. వైసీపీ ఎమ్మెల్సీలు మండ‌లికి కూడా రావ‌డం లేదు. తొలి రోజు మాత్ర‌మే వ‌చ్చిన ఎమ్మెల్సీలు మ‌రుస‌టి రోజు నుంచి గుడ్ బై చెప్పిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వీరు కూడా.. లేక మండ‌లి బోసిపోయిన‌ట్టు అయిపోయింది. ఉన్న 15 మంది ఎమ్మెల్సీల‌తోనే మండలి న‌డుస్తోంది. మంత్రులు త‌మ ప్ర‌సంగాల‌ను వారికే వినిపిస్తున్నారు. ఇలా అటు శాస‌న స‌భ‌కు, ఇడు మండ‌లికీ రాక‌పోవ‌డంతో వైసీపీ ప్రాభ‌వం మ‌రింత త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 26, 2024 2:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంచార్జ్‌ల‌ను మార్చినా వైసీపీకి ఊపులేదు

ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో చావు దెబ్బ‌తిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా…

19 mins ago

దేవర 2 మీద అక్కర్లేని అనుమానాలు

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…

58 mins ago

మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేసిన‌ చంద్ర‌బాబు.. !

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రుల‌ను డిజ‌ప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్ర‌వేశ…

1 hour ago

వావ్….నాగార్జున చేతికి డాల్బీ విజన్

ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…

2 hours ago

ఒట్టు..ప్రభాస్ ఎవరో తెలీదు: షర్మిల

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…

3 hours ago

బొత్సకు హగ్ ఇచ్చిన పవన్

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…

4 hours ago