Political News

సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్‌.. అస్త్ర శ‌స్త్రాలు రెడీ!

ముచ్చ‌ట‌గా మూడోసారి మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంలో కొలువుదీరిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ స‌ర్కారుకు తొలి పార్ల‌మెంటు స‌మావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. అయితే.. ఈ స‌మావేశాల‌ను బ‌డ్జెట్‌కే ప‌రిమితం చేయాల‌ని అధికార ప‌క్షం చూస్తున్నా.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ‘అంత‌కుమించి’ అన్న‌ట్టుగా దూకుడుగా ఉన్నాయి. గ‌త రెండు టెర్మ్‌ల‌లో ప్ర‌తిప‌క్షాలు వీక్‌గా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా కూడా ద‌క్కించుకున్న ద‌రిమిలా.. తొలి స‌భ‌లోనే రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానంలో రాహుల్‌గాంధీ ప్ర‌ధాని మోడీపై నిప్పులు చెరిగారు.

ముల్లును ముల్లుతోనే తీసినట్టుగా.. మోడీ హిందూత్వ వాదాన్ని అందే హిందూత్వ వాదంతో పార్ల‌మెంటులో తిప్ప‌కొట్టారు. నేరుగా మ‌హాశివుడి ఫొటోను పార్ల‌మెంటుకు తీసుకువ‌చ్చి… హిందూత్వ వాదంపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. హిందూత్వం అంటే ధ్వేషం కాద‌ని.. ప్రేమ అని రాహుల్ చేసిన ప్ర‌సంగానికి దేశ‌వ్యాప్తంగా మంచి మార్కులు ప‌డ్డాయి. దీంతో బీజేపీ సైతం ఉలిక్కి ప‌డింది. నిజానికి అప్ప‌టి వ‌ర‌కు రాహుల్ అంటే ‘ప‌ప్పు’ అని ప్ర‌చారం చేసిన క‌మ‌ల నాథులు ఆయ‌న చేసిన ప్ర‌సంగంపై వివ‌ర‌ణ ఇచ్చుకునే ప‌రిస్తితి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు కూడా రాహుల్ అస్త్ర శ‌స్త్రాలు రెడీ చేసుకున్నారు.

నీట్ ప‌రీక్ష‌లో అవ‌క‌త‌వ‌క‌లు స‌హా.. తాజాగా వెలుగు చూసిన యూపీఎస్సీ అవ‌క‌త‌వ‌క‌ల వ‌ర‌కు.. అదేవిధంగా రైలు ప్ర‌మాదాలు, అసోంలో వ‌ర‌ద‌లు, ఆర్థిక స‌ర్వే, ఉగ్ర‌వాదం.. ఇలా అనేక అంశాల‌పై ప్ర‌తిప‌క్షాలు స‌రంజామా సిద్ధం చేసుకున్నాయి. గ‌తంలో మాదిరిగా భారీ మెజారిటీ లేక‌పోవ‌డంతో మోడీ వాటి నుంచి త‌ప్పించుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఇదేస‌మ‌యంలో కొన్ని బిల్లుల‌ను కూడా మోడీ స‌ర్కారు తీసుకువ‌స్తోంది. వీటిలో కొన్నింటికి ఆమోదం ల‌భించినా.. మరో కీల‌క‌మైన బిల్లుకు మాత్రం ఇబ్బంది ఎదుర‌వడం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

అదే.. ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌లో బ్యాంకుల వాటాను 51 శాతంక‌న్నా త‌గ్గించ‌డం. త‌ద్వారా ఆయా సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించేందుకు స‌ర్కారు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. ఈ బిల్లు ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న ద‌శ నుంచి పార్ల‌మెంటుకు చేరేందుకు రెడీ అయింది. అయితే.. దీనిని ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. దీనిపై పెద్ద యుద్ధ‌మే జ‌రిగినా ఆశ్చ‌ర్యం లేదు. ఇక‌, బీహార్ రాష్ట్రం 30 వేల కోట్ల స‌హాయం చేయాల‌న్న డిమాండ్‌తోపాటు.. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అంశాన్ని బ‌లంగా ప్ర‌స్తావించ‌నుంది. ఏపీ నుంచి కూడా.. అధికార ప‌క్ష ఎంపీలు.. స‌హాయంపై ప‌ట్టుబ‌ట్ట‌నున్నారు. ఎలా చూసుకున్నా.. ఈ పార్ల‌మెంటు స‌మావేశాలు.. వాడి వేడిగా జ‌ర‌గ‌డంతోపాటు.. రాష్ట్రాల‌పై ముఖ్యంగా మిత్ర ప‌క్ష పాలిత రాష్ట్రాల‌పై మోడీ ప్రేమ ఎంతుందో తెలిసిపోతుంద‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on July 21, 2024 1:06 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

17 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago