తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) విజయం సాధించింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ గతేడాది సీన్ రివర్సయింది. బీఆర్ఎస్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ అహంకారభావమే అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అలాగే ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం మరో కారణమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పటికైనా మేలుకుని పార్టీ పేరులో తిరిగి తెలంగాణ చేర్చుదామని అంటున్నారు. కానీ కేసీఆర్ మరోసారి మొండి పట్టుదలతో ఉన్నారని, పార్టీ పేరు మార్చేదేలేదంటున్నారని తెలిసింది.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో 2022 అక్టోబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. మహారాష్ట్ర, ఏపీలోనూ బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలెట్టారు. కానీ పార్టీ నుంచి కేసీఆర్ తెలంగాణను తీసేస్తే.. తెలంగాణలో అధికారం నుంచి కేసీఆర్‌ను ప్రజలు దించేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అయితే ఒక్క చోట కూడా కేసీఆర్ పార్టీ గెలవలేకపోయింది. దీంతో జాతీయ రాజకీయాల సంగతేమో కానీ రాష్ట్రంలో పార్టీని బతికించాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అందుకే బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని కోరుతున్నాయి.
ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావడం హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ పేరు మార్చాలని హరీష్ కూడా బలంగా కోరుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇక నుంచి పార్టీని బీఆర్ఎస్‌గా కాకుండా టీఆర్ఎస్‌గానే పిలుస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అంటున్నారు. పార్టీ పేరు మార్పులో తాను ప్రధాన పాత్ర పోషించానని, పార్టీ ఓటమిలో తనకూ భాగం ఉందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెబుతున్నారు. పార్టీలోని మిగతా నాయకులు, కార్యకర్తల్లోనూ పార్టీ పేరును మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. కానీ కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పేరును మార్చేదే లేదని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారని టాక్. ఇప్పటికే కేసీఆర్ వైఖరి కారణంగా ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఇప్పటికైనా ఆయన మారకపోతే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 19, 2024 7:21 pm
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…