Political News

కేంద్ర బడ్జెట్.. బాబు డిమాండ్లు ఇవే

ఇంకో ఐదు రోజుల్లో కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరోసారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మూడో పర్యాయం మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్ ఇది. ఐతే గతంతో పోలిస్తే బడ్జెట్ భిన్నంగా ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు.

ఏపీలో టీడీపీ, బీహార్‌లో జేడీయూ సాధించిన సీట్లు కీలకంగా మారి, వాటి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంతకుముందులా తాము ఏమనుకుంటే అది చేయడానికి వీల్లేదు.

ఈ రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో పెద్ద పీట వేయక తప్పని పరిస్థితి. ఇదే అదనుగా ప్రత్యేక హోదాను డిమాండ్ చేయమని.. ఇంకోటని టీడీపీ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కానీ బాబు ఆచరణ సాధ్యం కాని హోదా లాంటి అంశాల జోలికి వెళ్లట్లేదు.

మోడీ ప్రభుత్వంతో సఖ్యతతో మెలుగుతూ వ్యూహాత్మకంగా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకోవాలని చూస్తున్నారు. బడ్జెట్లో ఏపీకి ఎక్కువ కేటాయింపులు ఉండేలా ఆయన మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల బడ్జెట్ ముంగిట బాబు పెట్టిన ప్రపోజల్స్ గురించి సమాచారం బయటికి వచ్చింది.

అమరావతిని మళ్లీ ఏపీ రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు అక్కడ అభివృద్ధిని పరుగులు పెట్టించి ఐదేళ్లలో ఆ ప్రాంత రూపు రేఖలు మార్చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆయన రూ.50 వేట్ల కేటాయింపులు కోరినట్లు సమాచారం. ఇక ఏపీకి జీవనాడి అవుతుందని భావిస్తున్న పోలవరాన్ని తిరిగి పట్టాలెక్కించడం కోసం రూ.12 వేల కోట్లు అడిగారట బాబు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పుల భారం పెరిగిపోయిందని.. పరిమితి దాటిన అప్పుల క్లియరెన్స్‌కి రూ.12 వేల కోట్లు కావాలని బాబు అభ్యర్థించారు. అలాగే ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు 10 వేల కోట్లు, ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టులకు రూ.60 వేల కోట్లు అడిగారట బాబు. ఆయన అడిగినవన్నీ ఇచ్చేస్తారని చెప్పలేం కానీ.. బడ్జెట్ పరిమితుల్లో కేటాయింపులు మెరుగ్గా ఉండేలా చూసుకుంటారనడంలో సందేహం లేదు. మరి 23న బడ్జెట్లో ఏపీ కోసం ఏం ప్రకటనలు ఉంటాయో చూడాలి.

This post was last modified on July 19, 2024 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago