ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర ఓటమి నేపథ్యంలో ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉన్న వారు ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రాలయం మినహా అన్ని స్థానాల్లో కూటమి విజయం సాధించింది.
నంద్యాల లోక్ సభ స్థానం నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు బైరెడ్డి శబరి టీడీపీ నుండి విజయం సాధించింది. నందికొట్కూరు స్థానం నుండి ఎమ్మెల్యేగా టీడీపీ నుండి జయసూర్య విజయం సాధించాడు.
నందికొట్కూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి కుటుంబ అడ్డా. మొన్నటి వరకు పెదనాన్నతో విభేదించిన వైసీపీ నుండి బైరెడ్డి సిద్దార్థరెడ్డి రాష్ట్ర శాట్స్ చైర్మన్ గా అక్కడ చక్రం తిప్పాడు. 2019 ఎన్నికల్లో వెంట ఉండి తానే గెలిపించిన ఎమ్మెల్యే అర్దర్ తో విభేదాలు ఏర్పడ్డాయి.
అంతకుముందు నందికొట్కూరు జనరల్ స్థానంగా ఉన్నప్పుడు 1978, 1983, 1989లో బైరెడ్డి శేషశయనా రెడ్డి, 1994, 1999లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్ కావడంతో వారు పెట్టిన వారే ఎమ్మెల్యేలు అవుతున్నారు. లేదా పరోక్షంగా వారు ప్రభావం చూపుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ప్రభావం తగ్గింది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు, 2 కో ఆప్షన్ నెంబర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయసూర్యకు సంబంధం లేకుండా అక్కడ చేరికలు సాగుతున్నాయి.
సిద్దార్థరెడ్డి అనుమాయులంతా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నా ఆయన ఏమీ అనడం లేదు. వ్యూహాత్మకంగా పెదనాన్న సమక్షంలో తన వర్గం మనుషులను టీడీపీలో చేర్పిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే జయసూర్య వర్గానికి చెక్ పెట్టేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం మారినా నందికొట్కూరులో బైరెడ్డి కుటుంబ రాజకీయం మారలేదని చెబుతున్నారు.
This post was last modified on July 17, 2024 3:58 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…