పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో.. టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు గత ఏడాది ఎన్నికలకు ముందు అనుసరించిన వ్యూహం బెడిసి కొట్టింది. అయితే, సదరు వ్యూహం తాలూకు చేదు అనుభవం.. ఇప్పటికీ.. బాబును వెంటాడుతుండడం గమనార్హం. ఇక్కడ ఇప్పుడు టీడీపీ జెండా పట్టుకునేవారు.. టీడీపీ తాలూకు వాయిస్ వినిపించేవారు కూడా కరువయ్యారు. పైగా.. పార్టీకి ఎంతచేసినా.. ప్రయోజనం ఏంటి? చివరాఖరుకు టికెట్ వేరేవారు ఎత్తుకుపోతారు? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ చంద్రబాబు వేసిన పాచిక ఏంటి.. వికటించిన విధానం ఏంటి.. చూద్దాం..
నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో బూరుగుపల్లి శేషారావు చక్రం తిప్పారు. పార్టీని బలోపేతం చేశారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ అన్ని విధాలా సహకరించారు. ప్రముఖ వ్యాపార వేత్తగా ఉన్న గోపాల కృష్ణ.. పార్టీలోనూ షాడో నాయకుడిగా ఎదిగారు. ఆదిలో శేషారావు ఈ పరిణామాన్ని లైట్‌గా తీసుకున్నారు. ఇద్దరం కలిసే కదా.. రాజకీయాలు చేస్తున్నాం.. అనుకున్నారు. కానీ, గత ఏడాది ఎన్నికల సమయంలో వేణుగోపాల కృష్ణ.. నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి.. టికెట్ తనకు ఇవ్వాలని కోరారు.
మరోపక్క, సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు .. పార్టీని నిలబెట్టిందే నేను నాకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో చంద్రబాబు ఇద్దరు అన్నదమ్ములతోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో నామినేషన్లకు గడువు సమీపించే వరకు కూడా ఇక్కడ అభ్యర్థిని తేల్చలేదు. చివరికి.. ఈ గందరగోళం మధ్యలో శేషారావుకే టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన 21 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం.. ఇద్దరు అన్నదమ్ములకు ఎలా ఉన్నప్పటికీ.. ఎటొచ్చీ.. పార్టీపైన, చంద్రబాబుపైన ప్రభావం పడింది. తన ఓటమికి చంద్రబాబు కారణమని శేషారావు వ్యాఖ్యానించడంతోపాటు. పార్టీకి దూరంగా ఉంటున్నారు.
అంతేకాదు, పార్టీ కోసం కష్టించినా.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తనకు టికెట్ ఇస్తారనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క, పార్టీకి గత ఏడాది ఎన్నికల వరకు నిధులు ఇచ్చిన శేషారావు సోదరుడు.. బాబు వైఖరి తనకు నచ్చలేదని, టికెట్ ఇస్తానని చెప్పి.. ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు సోదరుల మధ్య చంద్రబాబు వ్యూహం చిక్కులు తెచ్చింది. ఫలితంగా నిడదవోలు వంటి కీలకమైన నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకునే నాథుడు కరువయ్యారని అంటున్నారు స్థానిక నాయకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on September 24, 2020 1:52 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…