Political News

టీటీడీలో వాటా కావాలా? హైదరాబాద్ లో కూడా వాటా ఇస్తారా?

ప్రశ్నించేటోడు సరైనోడు లేకుంటే అడిగేటోడు ఏమైనా అడిగేస్తారనే దానికి నిదర్శనంగా ఉంది తెలంగాణ ప్రభుత్వ తాజా కోరికలు. విడిపోయి పదేళ్లు అవుతున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీలు ఒక కొలిక్కి రాని వేళ.. వాటి సంగతి చూద్దామన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించిన తీరు సానుకూలంగా ఉన్నప్పటికీ.. ఇరువురు ముఖ్యమంత్రులు భేటీకి సిద్ధమవుతున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసిన ఎజెండాలోని అంశాల్ని చూస్తే కొత్త సందేహాలతో పాటు.. ఏపీ ప్రభుత్వం అడగాల్సిన కొత్త అంశాలను ఎజెండాలో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిందే.

పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న అంశాలకు సంబంధించి లెక్కలు తేల్చుకొని.. సానుకూల వాతావరణం ఏర్పడిన వేళ.. మేం ఫలానా ఇస్తాం.. మీరు కూడా మాకు ఇవన్నీ ఇస్తారా?అని అడగటంలో అర్థం ఉంది. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సిద్ధం చేసిన అంశాల జాబితాను చూసినప్పుడు మరీ ఇంత అత్యాశేంటి? అన్న భావన కలుగక మానదు. విభజన కారణంగా ఏపీ నష్టపోయిన విషయాల మీద ఇప్పటివరకు సరైన చర్చ జరిగింది లేదు. విభజన వేళలోనూ.. కలిసి ఉందామన్న నినాదం నేపథ్యంలో అప్పటి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు కానీ.. పార్టీలు కానీ అడిగింది లేదు. ఈ కారణంగా భారీగా నష్టపోయింది ఏపీనే.

ఇదిలా ఉంటే.. పాత పంచాయితీల లెక్క తేలకుండానే కొత్త అంశాలతో చర్చల వాతావరణం సానుకూలంగా లేకుండా చేయాలన్న ఆలోచనతో రేవంత్ సర్కారు ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తే అంశాల్లో కొత్తగా చేర్చిన అంశాల్ని చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే.

తెలంగాణ లేవనెత్తే అంశాల్ని చూసినప్పుడు..

  • ఏపీలో కలిపిన 7 మండలాల్ని తిరిగి ఇవ్వాలి
  • ఆంధ్రప్రదేశ్ కు వెయ్యి కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి.
  • తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి. తెలంగాణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం ఇవ్వాలి.
  • తెలంగాణకు ఓడరేవులు లేవు. విభజనలో భాగంగా ఏపీలోని క్రిష్ణపట్నం.. మచిలీపట్నం.. గంగవరం పోర్టుల్లో భాగం కావాలి.

ఇవి కాకుండా మరికొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని పక్కన పెడితే.. ఏమాత్రం హక్కుల్లేని వాటి విషయంలోనూ వాటా కావాలని అడుగుతున్న రేవంత్ సర్కారు ఎలాంటి సందేశాన్ని ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తే అంశాల మాదిరే ఏపీ ప్రభుత్వం సైతం ఈ తరహా అంశాల్ని లేవనెత్తితే ఎలా ఉంటుందన్నది శాంపిల్ గా చూస్తే..

  • హైదరాబాద్ మహానగరం లాంటిది ఏపీకి లేదు. అంత ఆదాయం ఇచ్చే మహానగరం ఏపీలో లేదు. అందుకే దాని ఆదాయంలో ఏపీకి వాటా ఇవ్వాలి.
  • ఏపీకి రాజధాని లేదు. అమరావతి అని చెప్పినా అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికి పూర్తి అవుతుందో తెలీదు. అందుకే.. హైదరాబాద్ లో కొంత భాగాన్ని ఏపీకి శాశ్విత రాజధానిగా ఇచ్చేయాలి.
  • ఏపీకి సింగరేణి లాంటి సంస్థ లేదు. అందుకే.. దానిలో సగం వాటా ఇవ్వాలి.

ఇలాంటి అంశాల్ని తెర మీదకు తీసుకొస్తే ఎలా ఉంటుంది? రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఒకరికి దక్కినవి.. రెండో వారికి దక్కే అవకాశం ఉండదు. అలాంటప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తూ.. వాటిలో భాగం కావాలని కోరుకోవటంలో అర్థం ఉందా? అన్నది ప్రశ్న. తెలుగు రాష్ట్రం విడిపోయి ఇప్పటికే పదేళ్లు దాటింది. విభజన అంశాలు ఇప్పటికి బోలెడన్ని పెండింగ్ లో ఉన్నాయి. అలాంటి వాటిని చక్కటి వాతావరణంలో సెటిల్ అయ్యేలా చూసుకోవాల్సింది పోయి.. చర్చకు వచ్చే వేళలో.. ఏపీకి చెందిన వాటిల్లో భాగాలు కావాలని కొత్త ఎజెండా సిద్ధం చేయటం ఏమిటి? అన్నది ప్రశ్న.

తెలంగాణ లేవనెత్తే అంశాల్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. పెండింగ్ అంశాల మీద సానుకూల చర్చకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదన్న సంకేతాన్ని ఇస్తున్నట్లుగా భావించాలి. అదే సమయంలో.. కొత్త పీటముడుల్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. పాత పంచాయితీల్ని పరిష్కరించేందుకు వీల్లేని వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిన కొత్త అంశాల్ని చూస్తున్నప్పుడు ఒక్క భావన చప్పున కలుగుతుంది. ఈ పంచాయితీ అంతా ఎందుకు బాస్.. ఏపీని కూడా తెలంగాణలో కలిపేసుకోండని. రేవంత్ సర్కారు లేవనెత్తిన అంశాల్ని చూస్తే.. ఎవరికైనా అదే భావన కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on July 6, 2024 1:09 pm

Share

Recent Posts

నేపాల్ వరదల్లో చిక్కుకొని… 9 రోజుల తర్వాత బయటకు…

నేపాల్ వరదలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలాది మంది పౌరులు, పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా…

10 minutes ago

దమ్ముంటే పరకాలలో పోటీచేయాలి – సుస్మిత సవాల్

కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె కూతురు…

45 minutes ago

తాప్సి ఎంత కొత్తగా ట్రై చేసినా

ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొన్నేళ్లుగా పూర్తిగా బాలీవుడ్ కే…

2 hours ago

జడల్ విలన్లని సరిగా వాడుకోవాలి

ఇంకో 22 రోజుల్లో ప్యారడైజ్ ఆగమనం జరగనుంది. వచ్చే వారం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టనుండగా తెలుగు రాష్ట్రాల్లో జీవోలు,…

3 hours ago

కొండా సురేఖ ప్రయాణం ఎటు?

అంతా అనుకున్నట్లే అయ్యింది. మొదట్నుంచి ప్రచారం జరుగుతున్నట్టే మంత్రి కొండా సురేఖ మీద వేటు పడింది. ఆమె రాజీనామా చేయడానికి…

4 hours ago

స్టీరింగ్‌కు ముద్దుపెట్టి.. బస్సుకు సెల్యూట్‌ చేసి వీడ్కోలు

30 ఏళ్లకుపైగా తాను నడిపిన బస్సుకు ఓ డ్రైవర్‌ భావోద్వేగ వీడ్కోలు పలికిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.…

4 hours ago