Political News

అదే తప్పును చంద్రబాబు రెండోసారి కూడా చేస్తున్నాడా ?

చంద్రబాబునాయుడు ఒకే తప్పును రెండోసారి కూడా చేస్తున్నారు. మొదటిసారి పార్టీలోని నేతలు వారించినా వినలేదు. దాని ఫలితాన్ని ఇపుడు అనుభవిస్తున్నారు. మళ్ళీ అదే తప్పును ఇపుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కాకపోతే మొదటిసారి తప్పు చేసినపుడు అధికారంలో ఉన్నారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారంతే. ఇంతకీ ఆ తప్పు ఏమిటంటే తిరుమలకు వెళ్ళబోతున్న జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోమని చంద్రబాబు పిలుపివ్వటమే. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు జగన్ బుధవారం మధ్యాహ్నం తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం జరిగే గరుడోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

అందుకనే మధ్యాహ్నానికి జగన్ తిరుపతి చేరుకుని అలిపిరి గుండా తిరుమల చేరకుంటారు. ఈ సందర్భంలోనే జగన్ ను అడ్డుకోవాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపిచ్చారు. అన్యమతస్తుడైన జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు గట్టిగా వాదన మొదలుపెట్టారు. జగన్ను అడ్డుకుని డిక్లరేషన్ ఇచ్చేట్లుగా పట్టుబట్టి ఒప్పించాలంటూ నేతలకు పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి కాదు ఇది చివరా కాదు.

గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, జగన్ ఎన్నోసార్లు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఎప్పుడు వైఎస్ కుటుంబం విషయంలో లేని ‘అన్యమతస్తులు’ అనే అభ్యంతరం ఇపుడే చంద్రబాబు ఎందుకు లేవదీస్తున్నట్లు ? అసలు ఇటువంటి అభ్యంతరాలు, మతపరమైన రాజకీయాలు చేయటం వల్ల చంద్రబాబుకు వచ్చే లాభం ఏమిటో అర్ధం కావటం లేదు. అనవసరంగా టిడిపి నేతలు అలిపిరి దగ్గర కాసేపు గోల చేస్తారు, పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి తీసుకెళతారు. ఆ ఘటనలను మీడియా కొద్దిసేపు చూపుతుందంతే. కొద్దిసేపు మీడియా ప్రచారానికే చంద్రబాబు ఇటువంటి రాజకీయం చేయటమేంటో ?

గతంలో కూడా ఇటువంటి రాజకీయమే చంద్రబాబు చేశారు. స్వామివారి దర్శనం కోసం అప్పట్లో బిజెపి అధ్యక్షునిగా ఉన్న అమిత్ షా తిరుమలకు వచ్చినపుడు కూడా టిడిపి శ్రేణులు అడ్డుకుని నానా గోల చేశాయి. అమిత్ ప్రయాణిస్తున్న కారును అడ్డుుకన్నారు. ఈ క్రమంలో కొందరు అతివాదులు చెప్పులు, కర్రలు, రాళ్ళు వేసి గోల చేశారు. అది వేరే విషయం. అప్పుడు కూడా చంద్రబాబు టెలికాన్ఫరెన్సు పెట్టి మరీ తన నేతలను రెచ్చగొట్టారు. అమిత్ రాక సందర్భంగా నిరసనను తెలియజేయాలని ఆదేశించారు. దాంతో అప్పట్లో జరిగిన గొడవ జాతీయస్ధాయిలో చర్చకు దారితీసింది. అప్పుడంటే చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు కాస్త శాంతియుతంగా ఉంటారు. కానీ ఇఫుడు అలా కాదుకదా. పోలీసులు నేతలపై కేసులు పెట్టి జైళ్ళలో పడేస్తే బాధ్యతెవరిది ?

This post was last modified on September 24, 2020 12:16 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

6 hours ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

6 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

6 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

7 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

9 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

10 hours ago