ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండి తిరిగొచ్చారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో ఢిల్లీలో మాట్లాడారు. ఏపీలో సమస్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తామన్నారు. 2014-19 మధ్య చేపట్టిన పనులను త్వరిత గతిన పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో కీలకమైన ఐకానిక్ భవన సముదాయాన్ని పూర్తి చేయడం ద్వారా.. రాజధానికి కొత్తరూపం తీసుకువస్తామన్నారు. ఈ సందర్భంగా కొందరు మీడియా మిత్రులు కీలక ప్రశ్న సంధించారు. మరోసారి జగన్ అదికారంలోకి వస్తే.. ఏం చేస్తారు? అని అడిగారు.
ఈ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. “ఆ డెవిల్‌ను తరిమికొట్టాం. నియంత్రించాం. ఎవరికి ఇబ్బందులు ఉండవు” అని చెప్పారు. ఇక, రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఎన్నికల సమయంలో చెప్పారని.. అది ఎలా సాధ్యమని మరికొందరు ప్రశ్నించారు. మానవ వనరులే పెట్టుబడిగా సంపదను సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. స్మాల్, మీడియం, లార్జ్ స్కేల్ టైం బౌండ్‌తో ఉపాధి అవకాశా లు కల్పించనున్నట్టు వివరించారు. దీనికిగాను పీపీపీ స్థానంలో పీ-4 విధానాన్ని తీసుకురానున్నట్టు వివరించారు. ఇది అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా కూడా.. ఏపీనే గుర్తింపు దక్కించుకుంటుందన్నారు.
ఇక, పెట్టుబడుల విషయంపై అడిగినప్రశ్నలకు సంబంధించి.. చంద్రబాబు సమాధాన మిచ్చారు. దావోస్‌లో నిర్వహించే పెట్టుబ డుల సదస్సుకు హాజరవుతామని.. రాష్ట్రానికి ఏ కోణంలో, ఏ రూపంలో అవకాశం ఉన్నా.. ఖచ్చితంగా పెట్టుబడులు తీసుకువ స్తానని చెప్పారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చేందుకు ఎంతో అవకాశం, వాతావరణం కల్పించామన్న ఆయన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెట్టుబడి దారులను బెదిరించారని.. వారిని పంపించేశారని చెప్పారు. అయితే.. ఇప్పుడు మళ్లీ పాత రోజులు తీసుకురానున్నట్టు తెలిపారు. పెట్టుబడి దారులకు ఇబ్బంది లేని వాతావరణం కల్పించనున్నట్టు తెలిపారు.
కేంద్రంలో పదవుల విషయంపై అడిగిన ప్రశ్నలకు స్పందించిన చంద్రబాబు.. తమకు ఎలాంటి అసంతృప్తీ లేదన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇచ్చారని.. దీంతో సంతృప్తిగానే ఉన్నామన్నారు. గతంలో ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి లేవని.. కాబట్టి.. కేంద్ర ప్రభుత్వ పరిస్థితిని కూడా అర్ధం చేసుకున్నామన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామ న్నారు. వాజపేయి హయాంలో తమకు స్పీకర్ పదవి దక్కిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో ఏడు మంత్రి పదవులు కూడా ఆఫర్ చేశారని.. కానీ, తీసుకోలేదన్నారు.
This post was last modified on July 5, 2024 7:32 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…