వైసీపీ సీనియర్ నేత, మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం ముదురు తున్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే.. ఆయనను బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు కు వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. రామకృష్ణా రెడ్డి తరఫు న్యాయవాదులో మాట్లాడారు. బయటకు తీసుకువచ్చేందుకు ఏమైనా చేయాలని వారి కోరారు.
“ఇప్పటికిప్పుడు బెయిల్‌కు అప్లయ్ చేయలేమా?“ అని పిన్నెల్లి తరఫు న్యాయవాదులను జగన్ ప్రశ్నిం చారు. దీనికి వారు.. నిరాసక్తత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు ఆయన బయటకు రావడం కష్టమేనని తేల్చి చెప్పారు. దాదాపు 7 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు నమోదైనవే 7 ఉన్నా యని.. మరో 4 కేసులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారని చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన వాటిలో.. ఈవీఎంల ధ్వంసం.. టీడీపీ ఏజెంట్ శేషగిరిపై హత్యాయత్నం వంటివి సీరియస్‌గా ఉన్నాయని తెలిపారు.
అదేవిధంగా.. పిన్నెల్లి ప్రోత్సాహంతోనే మాచర్ల సీఐ నారాయణ స్వామిపైనా ఆయన అనుచరులు హత్యా యత్నం చేసినట్టు మరో కేసు పెట్టారని న్యాయవాదులు జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 307 సెక్షన్(హత్యాయత్నం) తీవ్రంగా ఉందన్నారు. విధుల్లో ఉన్న సీఐపైనే హత్యాయత్నం చేసినట్టు కేసు నమోదు కావడంతో సెక్షన్లు కూడా అంతే బలంగా ఉన్నాయన్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసు కూడా తీవ్రంగానే ఉందని వివరించారు.
ఇప్పటికిప్పుడు ఆయా కేసుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ వాదులు తేల్చి చెప్పారు. అంతేకా దు.. కనీసం రెండు మాసాలైనా జైల్లో ఉండాల్సి రావొచ్చన్నారు. అయితే.. అనుకూల ప్రాంతానికి బదిలీ చేయించుకునే అవకాశం ఉందని మాత్రం వెల్లడించారు. ఇదేసమయంలో బెయిల్ ఇవ్వద్దంటూ.. సుప్రీంకోర్టులో ఇప్పటికే కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయని.. వాటి విచారణ తర్వాతే.. స్థానిక కోర్టుల్లో పిన్నెల్లి తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. “మీరు చేయాల్సింది మీరు చేయండి. ఏ చిన్న అవకాశం ఉన్నా వదలొద్దు“ అని సూచించారు.
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…