ఏపీ తాజా మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి సుదీర్ఘ లేఖ రాశారు. 11 సీట్లే వచ్చినప్పటికీ.. ప్రజలు తమను పక్కన పెట్టినప్పటికీ.. అసెంబ్లీ అయినా.. గౌరవించాలని ఆయన కోరారు. అంతేకాదు.. ఇటీవల తనను అవమానించారంటూ పెద్ద బండపడేశారు. మంత్రుల తర్వాత.. తనతో ప్రమాణ స్వీకారం చేయించారని.. ఇదెక్కడి సంప్రదాయమని ఆయన నిగ్గదీసి నిజం ప్రశ్నించారు. అంతేకాదు.. స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు.. దీనికి ముందు వైసీపీని, జగన్‌ను చచ్చేలా కొట్టాలని అన్నారని.. ఇది ఎంతవరకు సబబని నిలదీశారు.
అక్కడితో కూడా.. జగన్ ఆగలేదు. నిబంధనలు.. సంప్రదాయాల తుట్టె కదిపారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని చెప్పారు. పార్లమెంటులోకాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఈ నిబంధన పాటించలేదని గతాన్ని ఆయన గుర్తు చేసుకుని.. అందరికీ గుర్తు చేశారు. ఇప్పుడు తమకు సీట్లు లేకపోయినా.. ప్రజలు ఇవ్వకపోయినా.. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలన్నది జగన్ చేసిన ప్రధాన కీలకమైన విజ్ఞప్తి. ఇది తప్పుకాదు. ఆయన అలా కోరడంలోనూ రాంగ్ లేదు.
కానీ, ఇంగ్లీషులో ఒక సామెత ఉన్నట్టు.. గివ్ రెస్పెక్ట్-టేక్ రెస్పెక్ట్.. అనేది అందరికీ వర్తిస్తుంది. గతంలో టీడీపీ 23 స్థానాలు మాత్రమే దక్కించుకున్నప్పుడు.. ఓ ఆరుగురు ఎమ్మెల్యేలను లాగేసుకుని.. ప్రతిపక్షం హోదా లేకుండా చేయాలని కుటిల యుక్తులు పన్నింది.. వైసీపీ కాదా? అప్పుడు ఈ చట్టం, ఈ రూల్స్ గుర్తుకు రాలేదా? అనేది ప్రశ్న. ఇక, జగనే చెబుతున్నట్టు.. సంఖ్యా బలంతో సంబంధం లేకుండా.. ఎంత మంది ఉన్నా.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. మాట్లాడే అవకాశం ఇవ్వాలి.. అని ఇప్పుడు చెబుతున్నారు. కానీ, గతంలో టీడీపీ పట్ల వ్యవహరించిన తీరు ఇప్పటికీ.. ప్రజల ముందు.. సోషల్ మీడియాలోనూ కనిపిస్తూనే ఉంది.. వినిపిస్తూనే ఉంది.
పోనీ.. ఇవి పక్కన పెట్టినా. సభకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కి.. వారిని అవమానించిన సందర్భాలు గుర్తు లేవా? కనీసం.. ప్రశ్నోత్తరాల సమయంలోనూ వారి సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకపోవడం గుర్తు రావడం లేదా? ఆ స్థాయి.. ఈ స్థాయి.. అని లేకుండా.. అందరినీ మూకుమ్మడిగా సభలో ‘గీతలు’ గీసి సస్పెండు చేసేందుకు ప్రయత్నించలేదా? ఇవన్నీ.. మరిచిపోయి.. ఇప్పుడు ‘మాకు గౌరవం ఇవ్వండి’ అని దేబిరించడం.. వల్ల ప్రయోజనం ఉంటుందా? హుందా తనం.. మాటల్లో కాదు.. చేతల్లోనూ ఉండాలి. సంప్రదాయాలు కాయితాలపై కాదు.. మాటల్లోనూ వినిపించాలి. చేతల్లోనూ కనిపించాలి.
మనకు గౌరవం , మర్యాద కోరుకుంటున్నప్పుడు.. ఎదుటివారి విషయంలోనూ అదే గౌరవం.. అదే సంప్రదాయం పాటిస్తే.. వారే గౌరవిస్తారు. కానీ, నాణేనికి ఒకవైపు చూసి.. సర్వంసహా చక్రవర్తిగా వ్యవహరించిన తర్వాత.. ఇప్పుడు ప్రజాతీర్పుతో గొంతులో ముద్ద నోట్లోకి వచ్చి.. గుటకలు వేస్తే మాత్రం ఎవరు వింటారు? వింటే మంచిదే!! కనీసం ఇప్పటికైనా మార్పు ఇటు నుంచి జరిగే ఆహ్వానించాల్సిందే!!
This post was last modified on %s = human-readable time difference 9:47 pm
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో హీరోయిన్లు అవకాశాలు ఎన్నయినా పట్టొచ్చు కానీ వరసగా హిట్లు కొట్టడం మాత్రం అరుదైన ఫీట్. అందులోనూ…
తండేల్ విడుదల తేదీ లీకైపోయింది. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టబోతున్నట్టు ఇవాళ జరిగే ప్రెస్ మీట్ లో నిర్మాత అల్లు…
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక ఆల్ టైం…
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో రాజకీయ వేదికను ఏర్పాటు చేసి… రాష్ట్రం సాధించిన పార్టీగా గుర్తింపు పొంది… అనంతరం భారత…
హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు టీజర్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…