దక్షిణాదివారంటే ఉత్తరాది వారికి చులకన భావమన్న వాదన దక్షిణాది ప్రజలతోపాటు రాజకీయ నేతల్లోనూ చాలాకాలంగా ఉంది. హిందీ భాష విషయంలో ఉత్తరాది వారి డామినేషన్ ను తమిళ తంబీలు గట్టిగా ప్రశ్నించిన సందర్భాలు అనేకం. ఇటీవలి కాలంలో మాకు హిందీ తెలియదంటూ తమిళులు పెడుతున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఉత్తరాది డామినేషన్ పై చలనం వచ్చింది. ఉత్తరాది ఆధిపత్యంపై కన్నడ ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరాది ఆధిపత్య ధోరణిపై కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమార స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 12 వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలో ఒక్కరు కూడా దక్షిణాదికి చెందిన వారు లేకపోవడాన్ని కుమార స్వామి విమర్శించారు.
12 వేల సంవత్సరాల భారతీయ సంస్కృతిని అధ్యయనం చేయడానికి 16 మంది నిపుణులతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిటీలో ఒక్కరంటే ఒక్కరు కూడా ద్రవిడ సంస్కృతి తెలిసిన దక్షిణాదివారు, కన్నడవారు కానీ లేరు. ఆ కమిటీలో దక్షిణాదికి ప్రాధాన్యత లేకపోవడంపై కుమార స్వామి అసహనం వ్యక్తం చేశారు.
ఇది చాలా బాధాకరమన్న కుమార స్వామి….ఆ కమిటీలో కనీసం ఒక్క మహిళకూ చోటు దక్కలేదన్నారు. దక్షిణాదికి చోటు లేకుండా ‘సంపూర్ణ భారతీయ సంస్కృతి’పై అధ్యయనం చేయడం ఏమిటని కుమార స్వామి ప్రశ్నించారు. సంపూర్ణ భారతీయ సంస్కృతిఅంటూ దక్షిణాదికి చోటివ్వకపోవడంపై కుమార స్వామి అడిగిన లాజిక్ కు కేంద్రం , ఉత్తరాది నేతలు ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 21, 2020 5:07 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…