రాజకీయ యుద్ధాలు పార్టీలకు మేలు చేస్తాయో లేదో తెలియదు కానీ.. సామాజికంగా కొన్ని జీవితాలకు మాత్రం మేలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా కేవలం నెలకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పింఛను మొత్తంపై ఆధారపడే అవ్వలు, తాతలు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఏపీలో పండగే పండగ. ఈ నెల 1వ తేదీ వరకు కూడా.. రూ.3000 మాత్రమే పింఛను అందుకున్న వారంతా ఇప్పుడు ఒకే సారి రూ.4000లకు చేరుకున్నారు.
ఇక, నుంచి ప్రతినెలా సామాజిక భద్రతా పింఛను కింద ప్రతి ఒక్కరికీ రూ.4000 చొప్పున అందనుంది. నిజానికి 2019 వరకు రూ.2000 మాత్రమే ఉంది. అయితే.. అప్పట్లో వైసీపీ అధినేత జగన్.. తాము అధికారంలోకి వస్తే.. విడతల వారీగా రూ.3000లకు ఈ పింఛను మొత్తాన్ని పెంచుతామని చెప్పుకొచ్చారు. అలానే చేశారు. దీంతో 2024 జనవరి నాటికి పింఛను దారుల సొమ్ము రూ.3000లకు చేరుకుంది. అది కూడా ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల కంటే కూడా.. ముందే వారికి అందేలా ఏర్పాట్లు చేశారు.
ఇక, తాజా ఎన్నికల్లో చంద్రబాబు ఈ పింఛను మొత్తాన్ని టార్గెట్ చేసుకుని..తాము అధికారంలోకి వస్తే.. రూ.4000లకు ఒకేసారి పెంచుతామని బిగ్ ప్రామిస్ చేశారు. అంతేకాదు.. ఇది కూడా ఏప్రిల్ మాసం నుంచే అందిస్తామన్నారు. పెరిగిన మొత్తాన్ని కలిపి జూలై 1న ప్రతి పింఛను దారునికీ.. రూ.7000 చొప్పున పంపిణీ చేస్తామన్నారు. దీంతో పింఛను దారులు చంద్రబాబును విశ్వసించారు. ఫలితంగా అఖండ మెజారిటీ దక్కింది. వీరి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చంద్రబాబు తాజాగా పింఛను మొత్తాన్ని పెంచే ఫైలుపై రెండో సంతకం చేయడం గమనార్హం.
అవును! గత ప్రభుత్వం రాష్ట్రంలోని 60 లక్షల మంది సామాజిక భద్రతా పింఛను లబ్ధి దారులకు రూ.3000 చొప్పున పంపిణీ చేసేందుకు రూ.6200 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.1000 చొప్పున పెంచడంతో ఈ భారం మరో వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి.. పింఛను మొత్తం పెంపుపై సంతకం చేయడం గమనార్హం.
This post was last modified on June 14, 2024 10:39 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…