రాజకీయ నేతలకుకొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉన్నట్టే.. పార్టీలకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి సెంటిమెంట్లు ప్రస్తావనకు వస్తున్నాయి. పార్టీ పెట్టిన తర్వాత.. వైసీపీ మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో గత 2019లో 22 చోట్ల విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, మూడు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే.. ప్రస్తుతం వైసీపీ నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం.
కానీ, ఒక కీలకమైన పార్లమెంటుస్థానంలో వైసీపీ విజయం దక్కించుకోలేదు. అంతేకాదు.. ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకోవడం.. ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇది వైసీపీకి కలిసిరాలేదా? అనే సందేహాలు కూడా తెరమీదికి వచ్చాయి. 2014లో తొలిసారి వైసీసీ పూర్తిస్థాయిలో పార్లమెంటుస్థానాలకు పోటీ చేసింది. ఈ క్రమంలో విజయవాడలో ఉన్న ఎంపీ సీటును దక్కించుకోలేకపోయారు.
ఆనాటి ఎన్నికల్లో ప్రముఖ వ్యాపార వేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు. భారీగానే డబ్బులు ఖర్చు చేశారు. కానీ, ఆయన ఓడిపోయారు. సరే.. ఓటమి, గెలుపు సహజమే అనుకున్నా.. ఆయన తర్వాత కాలం లో రాజకీయాలనూ వదిలేశారు. కట్ చేస్తే.. 2019లో బరిలో దిగిన ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త పీవీపీ ఓటమి చవిచూశారు. ఆయన కూడా భారీగానే ఖర్చు చేశారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. ఆ తర్వాత పీవీపీ రాజకీయాలకు కూడా దూరం అయ్యారు.
ఇదే క్రమంలో తాజా ఎన్నికల్లో ఓడిపోయిన కేశినేని నాని రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఈయన 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. విజయం దక్కించుకున్నారు. అయితే.. ఏం జరిగిందో ఏమో.. ఈ ఎన్నికలకు ముందు కేశినేని వైసీపీలో చేరారు. అనంతరం ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ కేటాయించారు. ఆ వెంటనే ఆయన రంగంలోకి దిగారు సిట్టింగ్ ఎంపీగా ఆయన ఎన్నో పనులు చేశారని అనేక మంది చెప్పారు. కేంద్రమే కితాబు ఇచ్చింది.
అయినా.. కేశినేని పరాజయం పాలయ్యారు. ఈంతో ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు నాని ప్రకటించిన విషయం తెలిసిందే. కట్ చేస్తే.. వైసీపీ తరఫున విజయవాడ ఎంపీలుగా పోటి చేసిన వారు ఓడిపోవడమే కాకుండా.. రాజకీయ సన్యాసం కూడా తీసుకోవడం చూస్తే.. ఈసీటు వైసీపీకి కలిసి రావడం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on June 11, 2024 8:11 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…