Political News

వైసిపి ఓటింగ్ 16 శాతం పడిపోయిందా ?

పార్టీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబునాయుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. అదేమిటంటే అధికార వైసిపికి 16 శాతం మంది జనాలు దూరమైనట్లు చెప్పారు. ప్రజల మద్దతును ప్రభుత్వంలో ఉన్న వైసిపి 16 శాతం కోల్పోయినట్లు చంద్రబాబు చెప్పగానే నేతలంతా ఆశ్చర్యపోయారు.

సర్కారుపై విశ్వాసం కోల్పోయిన వారిలో అధికులు ఎస్సీ, ఎస్టీ, బిసిలే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పటమే చంద్రబాబు ఉద్దేశ్యం అయుండచ్చు. మరలాంటపుడు ఎస్సీ, ఎస్టీ, బిసిల్లో మాత్రమే అధికంగా వ్యతిరేకత కనబడుతోందని, ఆ వర్గాలు మాత్రమే ప్రభుత్వానికి దూరమైనట్లు చంద్రబాబు చెప్పడం వెనుక 2019లో వారిలో ఎక్కువమంది జగన్ పార్టీకి మద్దతు వేసినట్లు చంద్రబాబు అర్థం చేసుకున్నారు అనుకోవాలి.

నిజానికి 16 శాతం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంత పెద్ద శాతం జనాలు ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకమయ్యారో కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా పై వర్గాల వాళ్ళపై దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయట. అందుకనే పై వర్గాలంతా ప్రభుత్వానికి దూరమైపోయారని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ పనితీరుపైన చంద్రబాబు ఏమైనా సర్వే చేయించారా ? ప్రభుత్వంపై జనాభిప్రాయాన్ని టిడిపి ఏమైనా సేకరించిందా ? లేకపోతే ఈ పనులు చేయటానికి చంద్రబాబు ఏదైనా ఏజెన్సీని నియమించారా ? అన్న విషయాల్లో స్పష్టత లేదు.

పార్టీ నేతలతో మాట్లాడుతు 16 శాతం జనాలు దూరమైనట్లు మాత్రమే చెప్పారు. అందుకు తన దగ్గరున్న ఆధారం ఏమిటో కూడా చెప్పుంటే బాగుండేది. బహుశా ఎన్నికలకు ముందు చంద్రబాబు తరపున రాష్ట్రంలో సర్వే చేసిన సంస్థలు ఏమైనా తాజాగా సర్వే చేశాయా? అన్నది ఒక ప్రశ్న. వాటిని కూడా బయటపెట్టి ఉంటే ఈ విషయం మరింతగా సంచలనం అయ్యేది.

This post was last modified on September 20, 2020 2:22 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

ఇకపై ఆలస్యం చేయను – అల్లు అర్జున్

ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…

7 hours ago

పుష్ప 2 సెన్సార్ అయిపోయిందోచ్ : టాక్ ఎలా ఉందంటే…

ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…

10 hours ago

అప్పట్లో శ్రీలీల డేట్స్ అంటే పెద్ద ఛాలెంజ్, కానీ ఇప్పుడు…

బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…

11 hours ago

బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…

11 hours ago

ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?

దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…

11 hours ago

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

12 hours ago