సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. అంతేకాదు.. పెద్ద ఎత్తున మెజారిటీ కూడా దక్కించుకుంటుందని .. ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంలో బీజేపీ అగ్ర నేతలు ఊదర గొట్టారు. దేశవ్యాప్తంగా 62 రోజులపాటు జరిగిన ప్రచా రంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఇదే మాట చెప్పారు. ఎక్కడ మాట్లాడినా.. ఏటీవీవి ఇంటర్వ్యూ ఇచ్చినా.. ఇదే చెప్పారు. అంతేకాదు.. బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు.. ఇక, ఎన్డీయే మిత్ర పక్షాలకు మరో 30కి పైగా సీట్లు వస్తాయని జోస్యాలువ ల్లించారు.
దీంతో కేంద్రంలో ఏర్పడే ఈ సారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పక్షాలకు 400 లకు పైగానే సీట్లు వస్తాయని.. దేశం మొత్తం తమ వైపే ఉందని కూడా ప్రధాని మోడీ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఇంత మెజారిటీ ఎవరికీ రాలేదని.. కానీ, ఈ సారి తమకు వస్తుందని అన్నారు. అంతేకాదు.. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని, వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ దూసుకుపోతున్నా రని.. 5 లక్షల ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను తాము సృష్టించనున్నామని చెప్పుకొచ్చారు. మరిన్ని బలమైన నిర్ణయాలను కూడా తీసుకునేందుకు ఈ 400లకు పైగా మెజారిటీ తమకు దోహద పడుతుందన్నారు.
అయితే.. ఇదేసమయంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజేపీకి 214 లేదా 240 సీట్లు మాత్రమే వస్తాయని పదే పదే చెప్పారు. కానీ, ఆ వ్యాఖ్యలను అప్పట్లో బీజేపీ నేతలు కొట్టి పారేశారు. కానీ, ఫలితాలు వచ్చిన తర్వాత.. బీజేపీకి దేశవ్యాప్తంగా ఒంటరిగా వచ్చిన స్థానాలు 240 మాత్రమే. ముఖ్యంగా యూపీలో ఆ పార్టీకి భారీగా సీట్లు తగ్గిపోయాయి. గత 2019లో 72 స్థానాలు రాగా.. ఇప్పుడు అవి 34కు తగ్గిపోయాయి. దీంతో బీజేపీ మెజారిటీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే 240కి పరిమితం కావడం గమనార్హం.
This post was last modified on June 8, 2024 6:43 am
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…