Political News

చంద్రబాబుకు ఇది గొప్ప ఊరటే..

విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి అన్నదే పెద్దగా జరగలేదు. మరోవైపు సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తూ ఖజానాను ఖాళీ చేసేసింది జగన్ సర్కారు. హద్దులు మీరి అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని జగన్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. ఉన్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకే నిధులు సరిపోని పరిస్థితి. ప్రతి నెలా అప్పులు తప్పట్లేదు.

ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమికి అంత తేలిక కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న పథకాలతోనే కష్టం అంటే.. కూటమి ఇంకా పెద్ద హామీలు ఇచ్చింది. వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుంది.. మరోవైపు రాజధాని, పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులు ఎలా సమకూరుస్తుంది.. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎలా గాడిలో పెడుతుంది అన్నది ప్రశ్నార్థకం.

ఐతే చంద్రబాబుకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా వెంటనే కాకపోయినా.. రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడులు పెరగడం ఖాయం. తద్వారా ఆదాయం, ఉపాధి పెరగొచ్చు. దీంతో పాటుగా సంపద సృష్టికి, ఆదాయం పెంచడానికి కొత్త మార్గాలు వెతకాలి. ఐతే రాష్ట్రం కొంచెం కుదురుకునే వరకు కేంద్రం నుంచి ఆర్థిక సహకారం చాలా అవసరం. ఒకవేళ మోడీ పార్టీ సొంతంగా మెజారిటీ సాధించి ఉంటే.. నిధులు తెచ్చుకోవడం కష్టమయ్యేది. కానీ ఇప్పుడు మోడీ సర్కారు టీడీపీ, జనసేనల మీద ఆధారపడుతోంది.

టీడీపీ లేదా జనతాదళ్.. ఈ రెంటిలో ఏది మద్దతు ఉపసంహరించుకున్నా మోడీ సర్కారుకు కష్టం కాబట్టి.. ఈ రెండు పార్టీలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. వాటి డిమాండ్లను తీర్చాల్సిందే. ఏపీకి న్యాయంగా రావాల్సిన వాటాలు ఇవ్వాలి. అలాగే ప్రాజెక్టులకు సాయం అందించాలి. ఇది చంద్రబాబు సర్కారుకు పెద్ద ఊరట కాబోతోంది. కేంద్రం నుంచి సహకారంలో ఉంటే కొంతలో కొంత ఉపశమనం ఉంటుంది. దీనికి తోడు చంద్రబాబు ఇమేజ్, ఆయన శ్రమ కూడా తోడైతే.. ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప టూ 1500 నాటవుట్ – రెండు వేల కోట్లు సాధ్యమా ?

పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…

57 minutes ago

భారత్ vs పాక్: ఫైనల్ గా ఓ క్లారిటీ ఇచ్చేసిన ఐసీసీ!

2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…

2 hours ago

గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోలు ఉంటాయి – దిల్ రాజు!

మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…

2 hours ago

డేటింగ్ రూమర్స్‌పై VD మరో క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…

3 hours ago

‘హరి హర వీరమల్లు’ నుంచి క్రిష్ తో పాటు ఆయన కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

3 hours ago