తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే అన్యమతస్థులు ఇకపై డిక్లరేషన్ సమర్పించనవసరం లేదంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిక్లరేషన్ అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ సంప్రదాయాన్ని ఇపుడు ఎందుకు తీసి వేస్తున్నారని ప్రతిపక్షాలు, హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి చర్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఉన్నపళంగా డిక్లరేషన్ అవసరం లేదన్న నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వైవీ సుబ్బారెడ్డి చెప్పాలని ఐవైఆర్ ట్వీట్ చేశారు.
ఈ నిబంధన ఈనాటిది కాదని, ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతోందని ఐవైఆర్ అన్నారు. తాను విద్యార్థిగా ఉన్నపుడు తిరమలను దర్శించుకున్నానని, ఆ సమయంలో దర్శనానికి వచ్చిన విదేశీయుడు డిక్లరేషన్ పై సంతకం పెట్టిన తర్వాతే దర్శనానికి అనుమతించారని ఐవైఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో సోనియా గాంధీ తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ పై చర్చ జరిగిందన్నారు. ఆ విషయంలో నాటి కార్యనిర్వహణాధికారి డిక్లరేషన్ కావాలని పట్టుబట్టడంతో కొందరు నేతల ఆగ్రహం వ్యక్తం చేశారని ట్వీట్ చేశారు. ఇపుడు హఠాత్తుగా ఈ మార్పునకు కారణమేంటో టీటీడీ చైర్మన్ చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని, నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
కాగా, తిరుమలను సందర్భించిన జగన్ ఏనాడు డిక్లరేషన్ పై సంతకం పెట్టలేదని చంద్రబాబు ఇటీవల అన్నారు. తాజాగా, ఈ నెల 23న తిరుమల బ్రహ్మాత్సవాల్లో శ్రీవారికి జగన్ పట్టుబట్టలు పెట్టబోతోన్న నేపథ్యంలోనే హడావిడిగా ఈ రూల్ తెచ్చారన్న వాదన సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే అంతర్వేది సహా బెజవాడ కనకదుర్గ ఘటనల నేపథ్యంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇపుడు తిరుమల విషయంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
This post was last modified on September 19, 2020 7:42 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించిన పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కడా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార…
+ ``పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!`` + ``మీ సెలవులు రద్దు చేస్తున్నాం.…
ఇండియా క్రేజీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది. ఆగస్ట్ 14…
దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’…
అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ…
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా…