ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు సాగుతున్నాయి. ఇప్పటివరకూ సరైన ఫలితం వచ్చిన వ్యాక్సిన్ ఒక్కటి లేదు. ఓవైపు జోరుగా వ్యాక్సిన్ ప్రయోగాలు సాగుతుంటే.. మరోవైపు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత.. దాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందించటం ఎలా? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వందల కోట్ల మందికి వ్యాక్సిన్ అందచేయాల్సి ఉంటుంది.
దాన్ని భరించే శక్తి చాలా దేశాలకు లేదు. దీంతో.. ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారన్నది ఒక ప్రశ్న అయితే.. వ్యాక్సిన్ డెలివరీ అంత చిన్న విషయం కాదంటున్నారు. ఎందుకంటే.. వ్యాక్సిన్ తయారీకి పెద్ద ఎత్తున కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి ప్రయోగం సక్సెస్ అయి.. దాని ఫార్ములాను ఫార్మా కంపెనీలకు ఇచ్చేసి ఉత్పత్తి షురూ చేయటం ఒక ఎత్తు అయితే.. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు ఎలా డెలివరీ చేస్తారన్నది అసలు ప్రశ్న.
ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో 28 సంస్థలు ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచ దేశాలకు అవసరమైన డోసుల లెక్క చూస్తే.. వందల కోట్ల డోసులు అవసరం. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి 780 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారిలో మనిషికి ఒక డోసు చొప్పున లెక్క చూసుకున్నా.. వ్యాక్సిన్ రవాణా అంత తేలికయ్యే విషయం కాదని చెప్పాలి.
780 కోట్ల మందికి ఒక్క డోసు చొప్పున పంపిణీ చేయాలన్నా.. దాదాపు 8వేల బోయింగ్ జెట్ విమానాలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఈ లెక్కన రెండు డోసుల చొప్పున వేయాలంటే.. రవానా ఏ స్థాయిలో అవసరమవుతుందో అర్థం చేసుకోవచ్చు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే దేశాల్లో రవాణా కొంత తేలికే అయినా.. పేద దేశాలకు అందుబాటులో తేవటానికి రోడ్ మార్గంలో ప్రయాణించాల్సి వస్తుంది. ఇది వ్యాక్సిన్ ను అందరికి అందుబాటులోకి తెచ్చే విషయంలో మరింత ఆలస్యమవుతుందని చెబుతున్నారు. దీంతో.. వ్యాక్సిన్ రవాణాకు సంబంధించి ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇక.. వ్యాక్సిన్ ను కోట్లాది డోసులు కొనుగోలు చేయటం చాలా దేశాల వారికి తమ స్థాయికి మించిన వ్యవహారంగా చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. యూనిసెఫ్ లు లాంటి సంస్థల తోడ్పాటుతోనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on September 19, 2020 7:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…