జూన్ 9.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన డేట్ ఇది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అధికారంలోకి వచ్చే పార్టీ తరపున ఓ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు ఇదే. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున జగనే రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. మరోవైపు గెలిచేది కూటమినేనని, చంద్రబాబు అదే రోజున ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఈ జూన్ 9 డేట్‌పై అంతటా చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ గెలిస్తే జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించే ప్రోగ్రామ్‌కు వెళ్లేందుకు టీడీపీ నాయకులూ ఆరెంజ్‌మెట్స్ చేసుకుంటున్నారు. దీంతో జూన్ 8, 9 తేదీల్లో ఫ్లైట్లు, హోటళ్లు ఫుల్ అయిపోయినట్లు సమాచారం. జగన్ అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ ప్రకటించింది. దీంతో వైసీపీ నాయకులంతా విశాఖకు క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ నగరంలోని హోటళ్లలోని గదులన్నీ బుక్ అయినట్లు తెలిసింది. విశాఖకు వెళ్లే విమానాల్లోనూ జూన్ 8న ఖాళీ లేదని అంటున్నారు.
మరోవైపు జూన్ 9నే బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ చెప్పంది కానీ అదెక్కడో మాత్రం చెప్పలేదు. కానీ కూటమి గెలిస్తే బాబు అమరావతిలోనే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు విమాన టికెట్లన్నీ బుక్ అయిపోయినట్లు చూపిస్తోంది. అక్కడ హోటళ్లలోనూ ఖాళీ లేదు. జూన్ 8న హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నానికి మొత్తం విమాన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మరొకొందరు నేతలు రైలు టికెట్లనూ బుక్ చేసుకుంటున్నారు. మరి సీఎం ఎవరవుతారు? ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు? అన్నది జూన్ 4న తేలిపోతుంది.
This post was last modified on May 25, 2024 4:09 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…