ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. అయితే.. అప్పటి నుంచి కూడా అనేక విశ్లేషణలు..అంచనాలు వస్తూనే ఉన్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయి..? అనే విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఎవరికి వారు ధీమా వ్యక్తం చేయడం.. ఎవరికి వారు.. సీట్ల లెక్కలు చెప్పడం మనకు తెలిసిందే.
అయితే.. అందరికీ తెలిసిన కామన్ ఫ్యాక్టర్.. ఈ వారం రోజుల్లో ఎవరు చెప్పినా.. ఒక పక్షానికి అనుకూలంగా నే చెప్పారనేది. పైగా ఏ అధ్యయనంతో వారు ఈ ఫలితాలు వెల్లడించారు? ఏయే అంశాలను పరిగణనలో కి తీసుకున్నారనేది మాత్రం గోప్యంగానే ఉన్నారు. పైపైకి ఏదో చెప్పినా.. అవి వాస్తవానికి దూరంగా ఉన్నాయి. పైగా ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను పరిశీలిస్తే.. అన్నీ లాభాపేక్ష సంస్థలు, వ్యక్తులే ఆయా విశ్లేషణలు చేయడం గమనార్హం. దీంతో ఎవరూ పెద్దగా విశ్వసించలేని పరిస్థితి ఏర్పడింది.
ఇక, ఇప్పుడిప్పుడే.. కొన్ని సంస్థలు ఏపీ ఫలితం సహా..జాతీయ ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేస్తు న్నాయి. ఇవి లాభాపేక్షలేని సంస్థలు కావడం.. ఇవి జాతీయ స్థాయి సంస్థలు.. పైగా ఒక పార్టీకి లేదా.. కొందరు వ్యక్తులకు అంటకాగే సంస్థలు కాకపోవడంతో వీటిపై కొంత మేరకు విశ్వసనీయత ఉంది. ఇలాంటి వాటిలో రెండు కీలక సంస్థలు తాజాగా ఫలితాలను కూలంకషంగా వెల్లడించాయి. కేంద్రంలో బీజేపీ ఎందుకు మరోసారి వచ్చే అంశాలను నిశితంగా వెల్లడించారు.
అదేవిధంగా ఏపీలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.. ఎవరు అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారనే విషయాలను ఈ సంస్థలు వెల్లడించాయి. అవే.. 1) సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ. 2) సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ .. పీపుల్ పల్స్. ఈ రెండు కూడా.. జాతీయ స్థాయిలో స్వచ్ఛందంగా సర్వేలు చేసే సంస్థలు. వీటి అంచనాల ప్రకారం.. కాంగ్రెస్‌కు సరైన నాయకత్వం లేకపోవడం.. బీజేపీ తరఫున మోడీ ఐకాన్ లీడర్‌గా ఉండడం.. పొరుగు దేశాలను కట్టడి చేయడం.. వంటివి కలిసి వస్తున్నాయని.. కాబట్టి బీజేపీ మరోసారి వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించాయి.
ఇక ఏపీ విషయానికి వస్తే.. ప్రధానంగా 4 కారణాలను విశ్లేషిస్తూ.. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధి కా రంలోకి వస్తుందని చెప్పడం గమనార్హం. ఈ పరిణామం.. వైసీపీలో మింగుడు పడడం లేదు. దీంతో ఆ పార్టీ నాయకులు డీలా పడినట్టు కనిపిస్తోంది.
ఈ రెండు సంస్థలు చెప్పిన కీలక విషయాలు ఇవీ..
1) సంక్షేమం విషయంలో వైసీపీ ఇప్పుడు ఇస్తున్న నగదును కూటమి ఎలానూ ఇస్తుందని చెప్పడంతో ఆ పార్టీల వైపు ప్రజలు మొగ్గు చూపారు. దీంతో కూటమికి విజయావకాశాలు పెరిగాయి.
2) అభివృద్ధి పరంగా చంద్రబాబును ఎక్కువ మంది ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. దీంతో బాబును చూసి మెజారిటీ ప్రజలు ఓటెత్తారని తెలిపింది.
3) అమరావతిని రాజధానిగా కోరుకున్న నగర ప్రజలు కూటమి వైపు చూశారనేది వీరి అంచనా.
4) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామన్న కూటమి ప్రచారం గ్రామీణ స్తాయిలో వర్కవుట్ అయిందని చెప్పుకొచ్చారు.
This post was last modified on May 21, 2024 4:05 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…