ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే.. అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. అంతేకాదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ కు సైతం బాబు లేఖలు రాశారు. ఆయా లేఖల్లో జగన్ వ్యవహార శైలిపై ఆందోళన వ్యక్తం చేశారు.
విషయం ఏంటంటే.. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచి లబ్ధిదారులకు ఇవ్వల్సిన నిధులు ఆపి వాటిని వ్యూహాత్మకంగా సరిగ్గా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాలో వేసేందుకు ఏపీలోని జగన్ సర్కారు ప్రయత్నించింది. దీనిని ఎన్నికల సంఘం అడ్డుకుంది. అయితే జగన్ దీనిపై కోర్టుకు వెళ్లారు. పేదలకు డబ్బులు రాకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇపుడే లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయడానికి అనుమతి ఇవ్వండి అని పదేపదే కోరారు. అయితే నాలుగు రోజులు ఆగి పోలింగ్ తర్వాతి రోజు డబ్బులు లబ్ధిదారులకు ఇవ్వండని ఎన్నికల సంఘం చెప్పింది. అప్పట్లో లబ్ధిదారులపై అంత ప్రేమ కురిపించను జగన్ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఆసరా, రైతు భరోసా కింద ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులు ఇవ్వాల్సి ఉందని.. అయితే.. వాటిని ఇవ్వకుండా ఆ నిధులను తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లుల కింద చెల్లేందుకు నిధులు వెచ్చిస్తున్నారన్నది చంద్రబాబు ఆరోపించారు.
అప్పుల కింద ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు తెచ్చారని.. అదేవిధంగా బాండ్ల విక్రయం ద్వారా 7000 కోట్లు సమీకరించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిధులను లబ్ధి దారుల ఖాతాల్లో వేయాల్సి ఉందని తెలిపారు. దీనిపై కోర్టులోనూ ఎన్నికల పోలింగ్‌కు ముందు పెద్ద ఎత్తున వాద ప్రతివాదాలు జరిగిన విషయాన్ని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నిధులను లబ్ధి దారుల ఖాతాల్లో వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చిందని.. కానీ, జగన్ ప్రభుత్వం అలా చేయకుండా ఆ నిధులను తన కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇది చట్ట విరుద్ధమని చంద్రబాబు తెలిపారు.
ఇలా లబ్ధి దారుల సొమ్మును బిల్లుల రూపంలో చెల్లించడాన్ని తాము ఖండిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. దీనిని తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విన్నవించారు. అంతేకాదు.. ఈ విషయంపై సీఎస్‌కు కూడా లేఖ రాస్తూ.. ఆ నిధులను లబ్ధి దారుల ఖాతాల్లో వేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని కూడా ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్‌కు ముందు లబ్ధి దారులపై ప్రేమను కుమ్మరించి ఓటు వేశాక బోడి మల్లన్న సామెతలాగ.. నిధులను బినామీ కాంట్రాక్టర్ల బిల్లులకు ఎలా వెచ్చిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారో.. సీఎస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on May 15, 2024 10:13 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…