Political News

కాంగ్రెస్‌లో చేరితే వైఎస్ 100 కోట్లు ఇస్తామ‌న్నారు: ఎర్ర‌బెల్లి

మాజీ మంత్రి, తెలంగాణ నాయ‌కుడు, బీఆర్ఎస్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో తాను టీడీపీలో ఉండ‌గా.. కాంగ్రెస్‌లోకి రావాలంటూ.. అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఒత్తిడి చేశార‌ని చెప్పారు. అంతేకాదు. రూ.100 కోట్లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ కూడా చేశార‌ని, మంత్రి ప‌ద‌విని కూడా గేలం వేశార‌ని.. అయినా తాను పార్టీ మార‌లేదని చెప్పుకొచ్చారు. పార్టీ మార‌లేద‌న్న కార‌ణంతో వైఎస్ త‌న‌పై క‌క్ష క‌ట్టిన‌ట్టు ఎర్ర‌బెల్లి చెప్పుకొచ్చారు. అందుకే వ‌ర్ధ‌న్న పేట నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎస్సీ కాన్‌స్టిట్యుయెన్సీగా మార్చేశార‌ని ఆరోపించారు.

అయితే.. 2026లో జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌లో వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి జ‌న‌ర‌ల్ కానుంద‌ని ఎర్ర‌బెల్లి చెప్పారు. వ‌ర్ధ‌న్న పేట నియోజ‌క‌వ‌ర్గం ద‌యాక‌ర్ రావు అడ్డాగా పేర్కొన్న ఆయ‌న జ‌న‌ర‌ల్ కాగానే తాను అక్క‌డ నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకుంటాన‌న్నారు. గ‌త డిసెంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న‌పై పోటీ మ‌హిళా అభ్య‌ర్థి క‌న్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అభ్య‌ర్థించార‌ని.. అందుకే ఆమె గెలిచార‌ని విమ‌ర్శించారు. లేక‌పోతే.. త‌నదే విజ‌యమ‌ని చెప్పుకొచ్చారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని ఎర్ర‌బెల్లి వ్యాఖ్యానించారు.

కాగా, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి త‌న శిష్యుడేన‌ని ఎర్ర‌బెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ మూడు సార్లే ఎమ్మెల్యే గెలిచిన విష‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తు పెట్టుకోవాల‌న్నారు. సీఎం రేవంత్ త‌న శిష్యుడే అయినా.. త‌నకు ఎప్పుడు నిల‌క‌డ లేద‌ని అన్నారు. అందుకే చంద్ర‌బాబును తిట్టార‌ని చెప్పారు. తాను కూడా చంద్ర‌బాబు వ‌ద్ద ప‌నిచేశాన‌ని, కానీ ఎప్పుడు దూషించ‌లేదన్నారు. పార్టీలో సంబంధం ఎలా ఉన్నా.. నాయ‌కులు నిజాయితీగా ఉండాల‌ని సూచించారు. వ‌చ్చే 10 నెలల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ అన్నారు. చంద్ర‌బాబును, కేసీఆర్‌ను మోసం చేసిన వారు చాలా మంది ఉన్నార‌ని ప‌లువురి పేర్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on May 11, 2024 9:25 am

Share
Show comments

Recent Posts

జనసేన వైపు బొత్స మనసు లాగుతోందా..?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…

34 minutes ago

నాన్న పోయినా ఏడవని తమన్

సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…

1 hour ago

కొరియోగ్రఫీ వల్ల పాటల స్థాయి పెరుగుతుందా

గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…

2 hours ago

వైరల్ వీడియో… పోసానితో సీఐడీ పోలీసుల ఫొటోలు

టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…

2 hours ago

రాబిన్ హుడ్ బిజినెస్ లక్ష్యం పెద్దదే

నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…

3 hours ago

కల్కి 2 : భైరవ & కర్ణ గురించే

టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…

3 hours ago