పార్టీని ఇప్పుడున్న పరిస్థితిలో బలోపేతం చేయాలి.. ఈ క్రమంలో మార్పులు సహజం..- ఇదీటీడీపీ అధినేత చంద్రబాబు పఠిస్తున్న రాజకీయ మంత్రం! మంచిదే. అయితే, ఈ మార్పుల నేపథ్యంలో అసలుకే ఆయన ఎసరు పెట్టుకుంటున్నారనే వాదన తెరమీదికి వస్తోందని అంటున్నారు సొంత పార్టీ నాయకులు.
తాజాగా ఏలూరు పార్లమెంటు వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న మాగంటి వెంకటేశ్వరరావు.. ఉరఫ్ బాబును మార్చేయాలనేది బాబు నిర్ణయంగా ఉందని ప్రచారం సాగుతోంది. గత ఏడాది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
పైగా పార్టీలోనూ యాక్టివ్‌గా లేరు. అనారోగ్య కారణాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్పు అవసరమే. కానీ, ఈ విషయంలో ఆయనతో మాటైనా చెప్పాల్సిన బాధ్యత.. అవసరం చంద్రబాబుకు లేవా? అంటు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే.. పార్టీలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. పార్టీకి అంతో ఇంతో నిధులు సర్దుబాటు చేసిన సీనియర్ నేత కావడం. పైగా .. బలమైన కోటరీ ఉన్న నాయకుడు.. కూడా కావడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు వల్ల తాము బజారునపడ్డామనే భావనతో రగిలిపోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు వేసే అడుగు కీలకం కానుంది.
కానీ, చంద్రబాబు మాత్రం మాగంటిని ఇక్కడ తప్పించి.. మరో వ్యక్తి(ఇంకా నిర్ణయించలేదు. చర్చల్లో ఉంది)ని నియమించాలని.. భావిస్తున్నారు. పోనీ.. ఇదే విషయాన్ని మాగంటితో అయినా చర్చించారా? అంటే లేదు. నిజానికి మాగంటి తల్లీ దండ్రులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. వారు కాంగ్రెస్‌లోను.. మాగంటిబాబు.. టీడీపీలో అనూహ్యమైన రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేస్తానంటే.. బాబుకు వ్యతిరేకత మరింత పెరిగిపోదా?
పైగా మాగంటి బాబు కుమారుడు రాంజీ ప్రస్తుతం పశ్చిమ గోదావరిజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయననైనా ఇక్కడ నియమించే అవకాశంఉంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. బాబు వ్యవహరిస్తే.. రేపు ఏలూరు కూడా టీడీపీ ఖాతా నుంచి పోవడం ఖాయమని తమ్ముళ్లే పెదవి విరుస్తున్నారు. గత ఏడాది ఎన్నికల్లోనూ ఇలా చేసుకునే చంద్రబాబు తాను చెడి.. అందరినీ చెడగొట్టారని పేర్కొంటున్నారు. మరి బాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 5:06 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…