ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటు ఏపీ హైకోర్టుతోపాటు అటు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ చాలా సందర్భాల్లో జగన్ సర్కారుకు చుక్కెదురవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో ఏర్పడిన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌కు ఉన్న అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్ విచారణ నిలిపివేయాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని, ఇదంతా దురుద్దేశంతో చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు తగిలాయన్న చర్చ జరుగుతోంది.
This post was last modified on September 16, 2020 1:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…