Political News

చింత‌మ‌నేనిపై సానుభూతి.. గెలిస్తే గిఫ్ట్‌తో బాబు రెడీ

ఈ సారి దెందులూరు ఎమ్మెల్యేగా చింత‌మ‌నేని ప్రభాక‌ర్ గెలుపు ఖాయ‌మా? అది తెలిసే చంద్ర‌బాబు ఆయ‌న‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇస్తా అన్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని గెలిచేందుకు మెరుగైన అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ మ‌రోసారి టీడీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. దూకుడైన రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న చింత‌మ‌నేనికి.. ఇచ్చిన మాట త‌ప్ప‌ర‌నే పేరుంది.

టీడీపీ నుంచి రెండు సార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన చింత‌మ‌నేనికి 2019లో ప‌రాజ‌యం ఎదురైంది. అప్పుడు వైసీపీ అభ్య‌ర్థి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి చేతిలో చింత‌మ‌నేని ఓడిపోయారు. ఈ ఓట‌మి నుంచి కోలుకునేందుకు కాస్త స‌మ‌యం తీసుకున్న ఆయ‌న‌.. తిరిగి వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ అయ్యారు. అక్క‌డ టీడీపీ క్యాడ‌ర్ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చూసుకున్నారు. ప్ర‌జల్లో ఉంటూ టీడీపీ ఓటు బ్యాంకు దెబ్బ‌తిన‌కుండా జాగ్ర‌త్త వ‌హించారు. ఇప్పుడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో చింత‌మ‌నేని విజ‌యంపై ధీమాతో ఉన్నార‌ని స‌మాచారం.

మ‌రోసారి వైసీపీ నేత అబ్బ‌య్య చౌద‌రిని ఢీ కొడుతున్న చింత‌మ‌నేని గెలిచి రివేంజ్ తీసుకోవాల‌నే టార్గెట్ పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌తో అబ్బ‌య్య గెలిచారు కానీ ఆయ‌న క‌ష్ట‌మేమీ లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక గెలిచిన త‌ర్వాత అబ్బ‌య్య ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా రాలేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. దీంతో గ్రౌండ్ లెవ‌ల్‌లో ప‌రిస్థితి చూస్తే చింత‌మ‌నేనిపై ప్ర‌జ‌ల‌కు సానుభూతి క‌లుగుతోంద‌ని తెలిసింది. ఆయ‌న‌పై మ‌ళ్లీ జ‌నాద‌ర‌ణ పెరిగింద‌ని ఈ సారి విజ‌యం ప‌క్కా అని చెబుతున్నారు. స‌ర్వేల ద్వారా బాబుకు ఇదే తెలిసింద‌ని, అందుకే ఈ సారి చింత‌మ‌నేని గెలిస్తే గిఫ్ట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని టాక్‌. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చింత‌మ‌నేని విప్‌గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on April 11, 2024 2:28 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

1 hour ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

4 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

6 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

7 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

7 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

8 hours ago