లోక్ సభ ఎన్నికల తర్వాత ఏ క్షణాన అయినా, పార్టీ పేరు మార్పు విషయమై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోవచ్చునట.!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ‘పార్టీ పేరుని మార్చేయడమే మంచిది..’ అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమయ్యింది. నిజానికి, ఆ ఎన్నికలకు ముందరే, ‘పార్టీ పేరుని మార్చేద్దాం.. తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పెట్టుకుందాం..’ అని కేసీయార్‌కి కొందరు పార్టీ కీలక నేతలు సూచన చేశారు.
అయితే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన కేసీయార్, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని తీసుకొచ్చేందుకు అంత సానుకూలత వ్యక్తం చేయలేదు.
కానీ, ఇప్పుడు పార్టీ పేరు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, ‘తెలంగాణ అంటే టీఆఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ.. పార్టీ పేరు నుంచి తెలంగాణ మాయమయ్యాక.. గులాబీ పార్టీని తమదిగా భావించలేకపోతున్నాం..’ అన్న భావన తెలంగాణ పల్లెల్లో గులాబీ పార్టీ సానుభూతి పరులనుంచే వ్యక్తమవుతోంది.
ఇప్పటికే, పేరు మార్పు విషయమై సాధ్యాసాధ్యాల పరిశీలన జరిగిందనీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో వున్నందున, కాస్త వేచి చూద్దామని పార్టీ ముఖ్య నేతలకు కేసీయార్ సూచించారట.
పేరు మార్చితే గులాబీ పార్టీ ఫేటు మారుతుందా.? అంటే, మారే అవకాశాలైతే లేకపోలేదు. భారత్ రాష్ట్ర సమితి పేరుని గులాబీ శ్రేణులే ఓన్ చేసుకోలేని పరిస్థితిని కేసీయార్ ముందే అంచనా వేయకపోవడం వ్యూహాత్మక తప్పిదమే.! తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇది తెలంగాణ ఇంటి పార్టీ అన్న భావన తెలంగాణ సమాజంలో ఖచ్చితంగా కలుగుతుంది.
This post was last modified on April 6, 2024 6:22 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…