ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి అదృశ్యం కేసులో సవాంగ్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో పోలీస్ వ్యవస్థ గాడితప్పుతోందని, ఏపీలో ‘రూల్ ఆఫ్ లా’ అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఏపీ డీజీపీని పలుమార్లు కోర్టుకు పిలిపించినా మార్పు రాలేదని, ప్రతిసారి ఇలా జరిగితే ప్రభుత్వానికి ఇబ్బంది అని వ్యాఖ్యానించింది. ప్రతి కేసులో సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. కాగా, ఈ నేపథ్యంలో అతడి మేనమామ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీవ్ర అసహనానికి లోనైంది. వెంకటరాజు అదృశ్యం కేసులో పోలీసుల తీరును తప్పుబట్టింది. గతంలో మూడు సార్లు జుడిషియల్ విచారణ చేస్తే పోలీసులదే తప్పని తేలిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా, గతంలోనూ సవాంగ్ పలుమార్లు హైకోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఓ దంపతులకు సంబంధించి హెబియస్‌కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సవాంగ్ తొలిసారి హైకోర్టులో హాజరయ్యారు. విశాఖపట్టణంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన వ్యవహారం నేపథ్యంలో రెండోసారి కోర్టు మెట్లెక్కారు. చంద్రబాబుకు స్థానిక పోలీసులు ఇచ్చిన నోటీసులపై వివరణ కోరుతూ డీజీపీ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఆ వ్యవహారంలో సుమారు ఆరున్నర గంటలపాటు సవాంగ్ కోర్టులో వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్రమ మద్యం తరలింపు వ్యవహారంలో పట్టుబడిన వాహనాల అప్పగింత వ్యవహారంలో సవాంగ్ మూడోసారి హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వాహనాల అప్పగింతలో పోలీసులు తీవ్ర జాప్యం చేస్తున్నారని పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంలో పోలీసులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టులో హాజరయ్యారు.
This post was last modified on September 15, 2020 2:58 am
ఇవ్వటంలో ఉండే ఆనందం అందరికి అర్థం కాదు. నలుగురికి సాయం చేసే ఛాన్సు దొరికితే కొందరు మాత్రమే ఆ దిశగా…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి... ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా…
ఒక్కోసారి దర్శకుల్లో ఎంత ప్రతిభ ఉన్నా ఒక్క డిజాస్టర్ లేదా ఫ్లాప్ వాళ్ళ కెరీర్ నే మారుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన చేసిన పని రాజకీయంగానే కాకుండా మార్కెట్లోనూ…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్లు ఇతర రాష్ట్రాలకు షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి టూరిజానికి ఏ స్థాయి బూస్ట్ దక్కుతుందో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో అర్థం కాదు. ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్…