Political News

క‌విత‌కు లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌!

అన్ని దారులు మూసుకుపోయిన స‌మ‌యంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆమెను అక్రమంగా అరెస్టు చేశార‌ని బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కులు ఆరోపిస్తున్నారు. కాదు, స‌క్ర‌మంగానే అరెస్టు చేశామ‌ని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వాద ప్ర‌తివాదాల మ‌ధ్య సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్‌(జేడీ), జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌క్ష్మీనారాయ‌ణ ఎంట్రీ ఇచ్చారు. క‌విత‌కు ఏకంగా ఆయ‌న లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా మారిపోయారు. ఆమెను అరెస్టు చేయ‌డం.. రేపు(శ‌నివారం) కోర్టులో ప్ర‌వేశం పెట్టడం నుంచి ఆమె ఏయే అంశాల‌ను లేవ‌నెత్తాల‌నే విష‌యాల‌పై ఆయ‌న కూలంక‌షంగా వివ‌రించారు.

లక్ష్మీనారాయ‌ణ స‌ల‌హాలు ఇవీ..

1) 161 సీఆర్పీసీ ప్రకారం మహిళలు విచారణ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. విచారణ అధికారులే మహిళల వద్దకు వస్తారు. గతంలో ఈడీ అధికారులు కవితను ఢిల్లీకి పిలిచారు. తాము కవితను విచారిస్తున్నది పీఎంఎల్ఏ చట్టం కింద అని, సీఆర్పీసీకి పీఎంఎల్ఏకి తేడా ఉందని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఈ కేసును సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.

2)  ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారాలు దర్యాప్తు సంస్థలకు ఉంటాయి. కవితను రేపు ఢిల్లీలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఈడీ మేజిస్ట్రేట్ ముందు చెప్పాలి.

3) కవిత న్యాయవాది కూడా అక్కడ వాదనలు వినిపించవచ్చు. మేం దర్యాప్తు సంస్థతో సహకరిస్తున్నప్పటికీ ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మేజిస్ట్రేట్ కు వివరించవచ్చు.

4)  ట్రాన్సిట్ వారెంట్  లేకుండా మహిళలను సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అలా అరెస్ట్ చేయాల్సి వస్తే మేజిస్ట్రేట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి.

5) సీఆర్పీసీలోని అంశాలు తమకు వర్తించవని ఈడీ అధికారులు అంటున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఇప్పుడు కవితను ఢిల్లీ తీసుకెళుతున్నారు కాబట్టి… విమాన ప్రయాణానికి లేదా రైలు ప్రయాణానికి పట్టే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను మేజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లాలి.

6) ఎవరినైనా అరెస్ట్  చేసినప్పుడు, ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశామో ఆ వ్యక్తికి సంబంధించిన ఒకరికి సమాచారం అందించాలి. ఆ విష‌యాన్ని కేస్ డైరీలో రాయాలి. కేస్ మెమోలో వాళ్ల సంతకం కూడా తీసుకోవాలి. రేపు మేజిస్ట్రేట్ ఎదుట ఆ ఆదేశాలను కవిత న్యాయవాదులు సమర్పించవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అరెస్ట్ చేస్తే స‌వాల్ చేయొచ్చు.

7) క‌విత అరెస్టులో రాజకీయ అంశాలు ఉన్నాయని కవిత భావిస్తే ఆ అంశాలను రేపు మేజిస్ట్రేట్ ఎదుట ప్రస్తావించవచ్చు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో రాజకీయ ప్రేరేపితంగా ఇలా అరెస్ట్ చేశారన్నది వారు నిరూపిస్తే రిలీఫ్ వ‌స్తుంది.

8) ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్న సమయంలో కానీ ఎవరినీ అరెస్ట్ చేయకూడదని ఎక్కడా నియమావళిలో లేదు.

This post was last modified on March 15, 2024 10:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జాక్ మిస్సవుతున్న కిక్స్ ఇవే

టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…

2 hours ago

బాబు ఔదార్యం చూసి చ‌లించిపోయా: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. బాబు ఔదార్యం…

2 hours ago

బాలికపై 23 మంది మృగాళ్లు…7 రోజుల కీచకపర్వం

దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…

3 hours ago

“ఆమె నటిస్తేనే సినిమా… లేదంటే లేదు”

కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…

3 hours ago

ట్రంప్ చర్యలకు బాబు బాధ్యుడా జగన్?

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…

4 hours ago

ఇది నిజం!… పవన్ విద్యార్థులకు అడ్డమే రాలేదు!

జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…

4 hours ago