రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే ఇద్దరు నేతలకు కేసీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు సీటు నుండి కొంచర్ల కృఫ్ణారెడ్డి, చేవెళ్ళ లోక్ సభకు కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికి విడతలవారీగా కేసీయార్ ఆరుగురు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 6 గురిని ఫైనల్ చేసిన కేసీయార్ తాజాగా మరో రెండుస్ధానాల్లో కూడా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే బీఆర్ఎస్-బీఎస్పీతో పొత్తుకుదిరింది.
పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు సీటును బీఎస్పీకి వదిలేశారు. ఈ సీటులో బీఎస్పీ అభ్యర్ధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిగిలిన 16 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపికచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో ఆరుగురిని ఫైనల్ చేసిన కేసీయార్ మరో ఇద్దరిని రెడీచేసినట్లు తెలుస్తోంది. అంటే ఇంకా 8 సీట్లలో అభ్యర్ధులను ఎంపిక చేయాలి. అయితే ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు ఇష్టపడంటలేదు. కేసీయార్ మాట్లాడినా సీనియర్లు వెనకాడుతున్నారు.
చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి కేసీయార్ టికెట్ ఇస్తే పోటీకి నిరాకరించారు. దాంతోనే ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు వెనకాడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది. చేవెళ్ళ నుండి పోటీచేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయటానికి సమావేశానికి రమ్మని రంజిత్ రెడ్డిని కేసీయార్ కబురుచేసినా రాలేదు. అలాగే నల్గొండ పార్లమెంటు సీటు పరిధిలోని నేతలతో కేసీయార్ నిర్వహించిన సమీక్షలో గుత్తా అమిత్ రెడ్డి కూడా హాజరుకాలేదు. మొన్నటివరకు నల్గొండ టికెట్ కావాలని పట్టుబట్టిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ఇపుడు ఎందుకు వెనక్కు తగ్గారన్నది అర్ధంకావటంలేదు.
గుత్తా అమిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారనే ప్రచారం బాగా జరుగుతోంది. ప్రచారం నిజమే అయితే తొందరలోనే గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి హస్తంపార్టీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశాన్ని కొట్టిపారేసేందుకు లేదు. అదే జరిగితే తండ్రేమో బీఆర్ఎస్ లో కొడుకేమో కాంగ్రెస్ లో ఉన్నట్లవుతుంది. అంటే తండ్రి, కొడుకులు మాట్లాడుకోకుండానే కొడుకు కాంగ్రెస్ లో చేరుతారా ? అలాగని చెప్పినా ఎవరైనా నమ్ముతారా ? చూస్తుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సిట్లు గెలిచి గుత్తా కూడా ఎంపీగా గెలిస్తే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమని అర్ధమవుతోంది.
This post was last modified on March 12, 2024 10:52 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…