Political News

ఏపీకి రాజధాని శాపం? చంద్రబాబు చెప్పిందే జరిగితే?

టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనలు సైతం సబబుగానే కనిపిస్తాయి. ఇలాంటివేళ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఏపీ ప్రజలకు రానున్న రోజుల్లో రాజధాని అంటూ ఒకప్రాంతం పర్మినెంట్ గా ఉండదా? అన్న సందేహం కలుగక మానదు.

బాబు హయాంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేయటం తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తూ.. విశాఖ.. కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. దీనిపై తాజాగా బాబు మాట్లాడుతూ.. రేపొద్దున మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధానిని నాలుగైదు ముక్కలు చేస్తానంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా ప్రాంతాల మధ్య సమంగా డెవలప్ చేయటానికే అంటే ఏం మాట్లాడతారు?అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానిని మారిస్తే.. రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. రేపు మరో రాష్ట్రం తమ రాజధానిని నాలుగైదు ముక్కలుగా చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్న మాటను కేంద్రాన్ని ప్రశ్నించాలని తన ఎంపీలను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

బాబు మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రాజధానుల్ని మార్చేలా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్న. ఇక.. ఏపీలో ఒకటిగా ఉన్న రాజధాని మూడుగా మారాయి. రేపొద్దున కొత్తగా వచ్చే మరో ప్రభుత్వం.. రాజధానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంటే ఏం కావాలి? అదే జరిగితే.. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని శాపం ఉందన్న మాట నిజం కావటమే కాదు.. ఒక పెద్ద రాజధాని నగరం లేని లోటు ఏపీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

This post was last modified on September 14, 2020 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

17 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

47 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago