ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ముత్తుమల అశోక్ రెడ్డి పోటీ ఖాయమైపోయిందా ? పార్టీ నుంచి అశోక్ కు ఈ మేరకు సమాచారం అందిందా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున రెడ్డి సామాజికవర్గంకు చెందిన అభ్యర్ధే పోటీ చేయబోతున్న కారణంగా టీడీపీ నుండి కూడా రెడ్డి అభ్యర్ధిని పోటీచేయిస్తేనే బాగుంటుందని చంద్రబాబునాయుడు, లోకేష్ డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. గడచిన ఐదేళ్ళుగా అశోక్ పార్టీ తరపున నియోజకవర్గంలో రెగ్యులర్ గా కార్యక్రమాలను నిర్వహిస్తునే ఉన్నారు.
పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలతో పాటు క్యాడర్ తో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నారట. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తు జనాల్లోనే ఉన్న అశోక్ రెడ్డే పార్టీ తరపున పోటీచేయటానికి సరైన అభ్యర్ధిగా సర్వేల్లో కూడా తేలిందట. 2014లో వైసీపీ తరపున గెలిచిన అశోక్ రెడ్డి తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన అశోక్ వైసీపీ అభ్యర్ధి అన్నా రాంబాబు చేతిలో సుమారు 80 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి రాంబాబుకు సుమారు 80 వేల మెజారిటి రావటం అప్పట్లో సంచలనమైంది.
తర్వాత పరిణామాల్లో రాంబాబు మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిందని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో తెలిసింది. దాంతో రాంబాబును మార్చేశారు. అందుకనే ఇపుడు అశోక్ ను పోటీచేయించటమే సరైన నిర్ణయంగా చంద్రబాబు అనుకున్నారట. ఇదే విషయాన్ని మూడురోజుల క్రితం లోకేష్ ఫోన్ చేసి అశోక్ కు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారట. రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి రెడీగా ఉండమని అశోక్ తో లోకేష్ చెప్పినట్లు ఆయన మద్దతుదారులు చెప్పారు.
అశోక్ కు టికెట్ ఇవ్వటంలో పార్టీలో పెద్దగా వ్యతిరేకత కూడా కనబడటంలేదు. ఎందుకంటే ప్రత్యర్ధి, అధికారపార్టీ అభ్యర్ధిని ఢీకొనేంతటి శక్తి పార్టీలో చాలామందికి లేదు. అందుకనే చంద్రబాబు గిద్దలూరు అభ్యర్ధిగా అశోక్ ను ఎంపికచేసినపుడు మిగిలిన నేతలెవరు అభ్యంతరం పెట్టలేదని పార్టీవర్గాల సమాచారం. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
This post was last modified on March 6, 2024 4:01 pm
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…