ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే, తాజాగా మరోసారి ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల తర్వాత ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని, తక్షణమే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ, సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దానికి సంబంధించిన వివరాలతో కూడిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ కూడా దాఖలు చేశామని కోర్టుకు విన్నవించారు. ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తూ తామ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపించారు. దాంతోపాటు బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయని వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తరఫున ముగ్గురు రోహిత్ కి వాదనలు వినిపించగా చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం ఇస్తామని హరీష్ చెప్పారు. దీంతో రెండు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని, మూడు వారాల తర్వాత ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని కోర్టు తీర్పు చెప్పింది. సీట్ల పంపకం, పొత్తుల వ్యవహారం పై కీలక దశలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టు తాజా తీర్పు భారీ ఊరట కలిగించిందని చెప్పవచ్చు.
This post was last modified on February 26, 2024 8:09 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…