తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నోరు పారేసుకున్నారు. తీవ్రస్థాయి లో రెచ్చిపోయి ఆయన హుందా తనం విడిచి పెట్టి పక్కా రోడ్డు సైడ్ రోమియో లాగా మాటలు తూలారు. కనీసం ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా విక్షణ మరిచి వ్యాఖ్యలు సంధించారు.
తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన బాల్కా సుమన్.. సీఎం రేవంత్ రెడ్డికి చెప్పు చూపించారు. “కేసీఆర్‌ను రండ అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలే గాడు” అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదన్నారు. కానీ, తనకు సంస్కారం ఉందని అది అడ్డొచ్చి ఆగుతున్నానన్నారు. కేసీఆర్‌ను రండ అంటారా? అని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పదవిని బట్టి, స్థాయిని బట్టి.. మాట్లాడాలని సుద్దులు చెప్పారు.
కానీ, బాల్క సుమన్ కూడా మాజీ ఎమ్మెల్యే అనే విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఆయన కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంతేకాదు, రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని నిందించారు.(వాస్తవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నది.. రైతులను కాదు.. రైతు బంధు ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్న బీఆర్ ఎస్ నాయకులను చెప్పుతో కొట్టాలి. అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు గతంలో సమాధానం చెప్పారు). ఇక, రైతు బంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్‌కి, కాంగ్రెస్ కంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళించారని బాల్క సుమన్ ఆరోపించడం గమనార్హం.
నేతలు, నెటిజన్ల ఫైర్
ఇదిలావుంటే, బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ నాయకులు, అటు నెటిజన్ల కూడా తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఇదేం పద్ధతి నాయకా? ఇంత బలుపు మాటలు ఎందుకు? అని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం స్థాయి అంటున్న బాల్కా సుమన్‌కు ఇప్పుడు ఏస్థాయి ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏ స్థాయిలో ఉండి ఆయన ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇటు బీఆర్ ఎస్‌కు, అటు కాంగ్రెస్‌కు ఎన్నికల ముందు మరో రగడ తెరమీదికి రావడం గమనార్హం.
This post was last modified on February 5, 2024 6:53 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…